Short News

Galaxy S9, Galaxy S9 plus కెమెరాపై ఆసక్తికర విషయాలు

Galaxy S9, Galaxy S9 plus కెమెరాపై ఆసక్తికర విషయాలు

శాంసంగ్ నుంచి వచ్చే ప్రతి ఆవిష్కరణలో ఏదో కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా శాంసంగ్ Galaxy S9, Galaxy S9 plus ఫోన్ల కెమెరాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ఈ ఫోన్లలో కెమెరా పనితీరు చాలా బాగుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో పొందుపరిచిన కెమెరాలు ఔత్సాహికులకు మంచి ఆనందాన్ని ఇస్తున్నాయని, ఫోటోలు చాలా అందంగా వస్తున్నాయని చెబుతున్నారు. లో లైట్లో కూడా అదిరిపోయే ఫోటో షాట్లు తీసుకునే విధంగా కెమెరాలు ఉన్నాయి.

శ్రీరెడ్డికి పెళ్లికాకుండానే.. సంచలనం రేపుతున్న కరాటే కల్యాణి లీక్స్

శ్రీరెడ్డికి పెళ్లికాకుండానే.. సంచలనం రేపుతున్న కరాటే కల్యాణి లీక్స్

క్యాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కల్పించాలని ఉద్యమం చేస్తున్న శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలను నటి కరాటే కల్యాణి బయటపెట్టడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కల్యాణి షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్‌లో చర్చ సందర్భంగా శ్రీరెడ్డి, కల్యాణి మధ్య వివాదం చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ సయయంలో శ్రీరెడ్డి గొంతు పిసికి కల్యాణి చంపబోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై కల్యాణి సంచలన విషయాలు బయటపెట్టారు.

రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త

రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త

రాష్ట్ర రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పూర్తి చేసినందుకు గానూ సీఎం కేసీఆర్.. ఒక నెల మూలవేతనాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రోత్సాహకంగా అందుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోత్సాహకాలు ప్రకటించడంపై రెవెన్యూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెవెన్యూ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
రూ.లక్ష కోట్లతో ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ డీల్‌ ..వచ్చేవారమే.!

రూ.లక్ష కోట్లతో ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ డీల్‌ ..వచ్చేవారమే.!

గత కొంతకాలంగా ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను వాల్‌మార్ట్‌ సొంతం చేసుకోనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో రెండు సంస్థల మధ్య ఒప్పందం జరగొచ్చని సమాచారం. ఈ ఒప్పందం విలువ 18 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.19లక్షల కోట్లు. ఫ్లిప్‌కార్ట్‌లో 51శాతం, అంతకంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్‌ చర్చలు జరుపుతోంది. డీల్‌ దాదాపు పూర్తయ్యిందని, మే మొదటి వారంలో దీనిపై స్పష్టత వస్తుందని కూడా అంటున్నారు.