Short News

ఎంఐ తొలి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

ఎంఐ తొలి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

షావోమి సంస్థ తన తొలి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను శనివారం లాంచ్‌ చేసింది. దీని ధర సుమారు రూ.31,100 గా కంపెనీ పేర్కొంది.‘షావోమి బ్లాక్‌ షార్క్‌' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు షావోమి పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ లిక్విడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను‌, స్పెషల్‌ బటన్‌ను‌, డిటాచ్‌బుల్‌ గేమ్‌ప్యాడ్‌ను, ఎక్కువ బ్యాటరీను కలిగి ఉంది. ఏప్రిల్‌ 20 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపింది. జేడీ.కామ్‌లో ఈ ఫోన్‌ ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌కు వచ్చేసింది.
మళ్లీ అదే బ్యానర్ లోనే కల్యాణ్ రామ్ మరో సినిమా

మళ్లీ అదే బ్యానర్ లోనే కల్యాణ్ రామ్ మరో సినిమా

ఇటీవల ఎమ్మెల్యే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కల్యాణ్ రామ్ త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు కల్యాణ్ రామ్. నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్‌ కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే మరో సినిమా చేయబోతున్నాడట. ఏప్రిల్‌ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.  నివేదా థామస్‌, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు.
ఏపీలో బీజేపీకి గట్టి దెబ్బ: వైసీపీలోకి కన్నా-కాటసాని

ఏపీలో బీజేపీకి గట్టి దెబ్బ: వైసీపీలోకి కన్నా-కాటసాని

ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంలో ఇరుకునపడ్డ బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో మరో షాక్. ఇద్దరు కీలక నేతలు త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ బుధవారం వైసీపీలో చేరనున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్ సమక్షంలో ఎల్లుండి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా బీజేపీని వీడి ఈ నెల 29న వైసీపీలో చేరనున్నారు.

రిటైర్ మెంట్ ఎప్పుడో  ''అప్పుడు''  ప్ర‌క‌టిస్తాః యువ‌రాజ్‌

రిటైర్ మెంట్ ఎప్పుడో ''అప్పుడు'' ప్ర‌క‌టిస్తాః యువ‌రాజ్‌

టీమిండియా హార్డ్ హిట్ట‌ర్ యువ‌రాజ్ సింగ్ త్వ‌ర‌లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌నున్నాడా? ఈ ప్ర‌శ్న‌కు తాజాగా యువ‌రాజ్ సింగ్ జ‌వాబు చెప్పాడు. `నేను 18 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. నా రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అయితే ఫార్మాట్ ఏదైనా 2019 ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు క్రికెట్ ఆడాల‌నుకుంటున్నా. వ‌చ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జ‌రిగే 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాల‌నుకుంటున్నా. ఆ అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నా. అప్ప‌టివ‌రకు వేచి చూసి రిటైర్మెంట్‌పై నా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తా` అని యువీ చెప్పాడు.