Short News

రూ.915కే  ఫీచర్‌ఫోన్

రూ.915కే ఫీచర్‌ఫోన్

జియోక్స్ మొబైల్స్ తన నూతన ఫీచర్‌ఫోన్ 'ట్యూబ్‌లైట్‌'ను ఇవాళ విడుదల చేసింది. సాధారణ ఫీచర్ ఫోన్లలో ఉండే సింగిల్ ఎల్‌ఈడీ టార్చిలైట్‌కు బదులుగా ఇందులో 8 ఎల్‌ఈడీ లైట్లు కలిగిన టార్చిలైట్‌ను ఏర్పాటు చేశారు. ఇదే ఇందులో ఉన్న ప్రత్యేకత. ఈ ఫీచర్ ఫోన్‌లో మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్, ప్రైవసీ లాక్, ఆటో కాల్ రికార్డింగ్, 2.4 ఇంచ్ డిస్‌ప్లే, ఇంటర్‌నెట్ కనెక్టివిటీ, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, వీజీఏ బ్యాక్ కెమెరా,  ఎస్‌వోఎస్ ఫీచర్, వైర్‌లెస్ ఎఫ్‌ఎం, బ్లూటూత్ వంటి సదుపాయాలు ఉన్నాయి. బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ రూ.915కు వినియోగదారులకు లభిస్తున్నది.
ఆసక్తికరంగా అమితాబ్ ‘102 నాటౌట్‌’ పోస్టర్

ఆసక్తికరంగా అమితాబ్ ‘102 నాటౌట్‌’ పోస్టర్

27 ఏళ్ళ త‌ర్వాత బాలీవుడ్ స్టార్ హీరోస్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, రిషీ క‌పూర్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం 102 నాటౌట్‌. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫన్నీ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. గుడ్డులో నుండి రిషీ క‌పూర్ బ‌య‌ట‌కి వ‌స్తున్న‌ట్టు పోస్ట‌ర్ లో క‌నిపిస్తుండ‌గా, బాప్ కూల్‌.. బేటా ఓల్డ్ కూల్ అనే క్యాప్ష‌న్‌తో పోస్ట‌ర్ అభిమానుల‌లో ఆనందాన్ని క‌లిగిస్తుంది. మే 4న విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్ ఇటీవ‌ల‌ విడుద‌ల అయింది. 102 ఏళ్ళ తండ్రి పాత్ర‌లో అమితాబ్‌, 72 ఏళ్ళ కొడుకు పాత్ర‌లో రిషి క‌పూర్ అద్భుతంగా న‌టించారు.
సంచలనం:బిసి కమీషన్ కు జస్టిస్ మంజునాథ రాజీనామా

సంచలనం:బిసి కమీషన్ కు జస్టిస్ మంజునాథ రాజీనామా

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవికి జస్టిస్ కేఎల్ మంజునాథ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను మెయిల్ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ కు పంపారు. బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున...ఇక తనకు పనిలేదని....అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు మంజునాథ తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బిసి కమిషన్ కు తనను ఛైర్మన్ గా నియమించినందుకు సీఎంకు మంజునాథ ధన్యవాదాలు తెలిపారు.ఎపి ప్రభుత్వం మంజునాథ కమిటీని 29 జనవరి 2016లో నియమించింది .

మరోసారి ఆమరణ నిరాహార దీక్ష దిగిన అన్నా హజారే

మరోసారి ఆమరణ నిరాహార దీక్ష దిగిన అన్నా హజారే

సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆయన శుక్రవారం దీక్షను ప్రారంభించారు. అవినీతి కేసుల విచారణ కోసం లోక్‌పాల్‌ను నియమించాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై హజారే అసంతృప్తి వ్యక్తంచేశారు. తన దీక్షను ప్రారంభించే ముందు ఆయన రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేతలకు పాలన చేతగావడం లేదు. నా తుదిశ్వాస వరకు పోరాడుతూనే ఉంటాను అని హజారే స్పష్టంచేశారు.