Short News

మక్కా మసీదు పేలుళ్ల కేసు: కాసేపట్లో ఎన్ఐఏ కోర్టు తీర్పు

మక్కా మసీదు పేలుళ్ల కేసు: కాసేపట్లో ఎన్ఐఏ కోర్టు తీర్పు

మక్కామసీదు పేలుళ్ల కేసులో నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. 11ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో తీర్పు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసులు కోర్టు, పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2007 మే 18న మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో చార్మినార్‌ సమీపంలోని మక్కామసీదు ఆవరణలోగల వజూఖానా వద్ద ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌(ఐఈడీ) బాంబు పేలడంతో 9మంది మరణించగా, 58 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. అక్కడికి సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం.

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 28 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్‌4లోపు పంపించాలి. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్‌ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.  
కొరటాల నెక్స్ట్ మూవీపై పెరుగుతున్న ఆసక్తి.. హీరో అతడేనా!

కొరటాల నెక్స్ట్ మూవీపై పెరుగుతున్న ఆసక్తి.. హీరో అతడేనా!

వరుసగా నాలుగు విజయాలు సాధించితిన దర్శకుడు, హీరోలు ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ అందుకున్న దర్శకుడు ఎవరంటే వెంటనే కొరటాల శివ పేరు గుర్తుకు వస్తుంది. రొటీన్ కమర్షియల్ చిత్రాల తరహాలో కాకుండా.. కమర్షియల్ అంశాలు ఉంటూనే సందేశాన్ని ఇవ్వడం కొరటాల స్టైల్ అని అర్థం అయిపోయింది. తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకుంటున్న కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. దీనితో కొరటాల నెక్స్ట్ మూవీ ఎవరితో అనే ఆసక్తి అందరిలో ఎక్కువైపోతోంది.