Short News

కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయడంలేదు

కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయడంలేదు

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తామని ఈ ఏడాది జనవరిలో ఓవైసీ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఆయన జేడీయూకు మద్దతు ఇచ్చి.. ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తామని తెలిపారు. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం, జేడీయూ నేత కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.
గతంలోను అత్యాచారాలు జరిగాయి, కానీ: హేమమాలిని

గతంలోను అత్యాచారాలు జరిగాయి, కానీ: హేమమాలిని

హిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాల అంశంపై బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. పెరిగిన మీడియా, సోషల్ మీడియా, ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం కారణంగా చిన్నారులు, మహిళలపై జరుతున్న దాడులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. గతంలోను ఇలాంటివి చోటు చేసుకున్నాయన్నారు.ఈ ఘటనలపై ప్రజలలో చైతన్యం పెరిగిందని, గతంలో కూడా ఇలాంటివి అనేకం జరిగాయని, కానీ వాటి గురించి ఎవరికి తెలియదని, వీటిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, వాటికి పరిష్కారం చూపిస్తుందని, ఇలాంటి దుర్ఘటనలు అసలు జరగకూడదని, వాటి వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందన్నారు.

‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్  నటిస్తే బాగుంటుంది

‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్ నటిస్తే బాగుంటుంది

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తన బయోపిక్‌ ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' చిత్రంతో నటుడిగా మారారు. అయితే ఈ సినిమాలో సచిన్‌ నటన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌కి కూడా తెగ నచ్చేసినట్టుంది. సచిన్‌ అమెరికన్‌ సూపర్‌హీరో సిరీస్ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌' ‌లో నటిస్తే బాగుంటుందని బెనెడిక్ట్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ సిరీస్‌లో బెనెడిక్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బెనెడిక్ట్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్' చిత్రం భారత్‌లో ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా మరో మారు వాయిదా పడి జూన్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. రజనీకాంత్ నటించిన మరో చిత్రం 2.0 కూడా విడుదల కావలసి ఉంది. 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన స్టంట్స్ కోసం 40 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారట.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.