Short News

మక్కామసీదు పేలుళ్ల కేసును కొట్టేసిన కోర్టు

మక్కామసీదు పేలుళ్ల కేసును కొట్టేసిన కోర్టు

మక్కా మసీదు పేలుళ్ల కేసులో నాంపల్లి ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులపై ఆధారాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కేసును కొట్టివేసింది. ఐదుగురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించింది. 2007లో మక్కా మసీదులో జరిగిన పేలుళ్ల కేసులో 10 మంది నిందితుల్లో ఐదుగురిపై చార్జీషీటు దాఖలైంది. ఐదుగురిపై విచారణ పూర్తి కాగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో సందీప్ వి డాంగే, రాంచందర్ కల్సంగర్, అమిత్ చౌహన్ ఉన్నారు. తేజ్‌రామ్ పార్మార్‌పై విచారణ కొనసాగుతుంది. సునీల్ జోషీ అనే నిందితుడు హత్యకు గురయ్యాడు.
షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా మరో మారు వాయిదా పడి జూన్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. రజనీకాంత్ నటించిన మరో చిత్రం 2.0 కూడా విడుదల కావలసి ఉంది. 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన స్టంట్స్ కోసం 40 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారట.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

ఎయిరిండియా బోయింగ్ విమానం ప్రయాణికులను బెంబెల్లెత్తించింది. విమానంలోని విండో ప్యానెల్ విరిగి ప్రయాణికులపై పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.15 నిమిషాల పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఓవర్ హెడ్ ప్యానెల్‌కు తల బలంగా తాకిన ప్రయాణికుడికి కుట్లు పడినట్టు చెప్పారు.
మైనర్‌పై డాక్టర్ రేప్,కేసు

మైనర్‌పై డాక్టర్ రేప్,కేసు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ డాక్టర్ దారుణానికి పాల్పడ్డారు. ఒంటరిగా చికిత్స కోసం వచ్చిన బాలికపై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకొంది. చికిత్స కోసం వెళ్ళిన బాలిక రెండు రోజులుగా ఇంటికి రాలేదు. రెండు రోజుల తర్వాత ఆమె ఇంటికి చేరుకొంది.మత్తులో ఉన్న పరిస్థితిలోనే బాలిక ఇంటికి చేరుకొంది. బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికకు మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు ప్రకటించారు.