Short News

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ క‌ల‌క‌లం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ క‌ల‌క‌లం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ క‌ల‌క‌లం చోటు చేసుకుంది. త‌నిఖీల సంద‌ర్భంగా ఓ వ్యక్తి వద్ద బుల్లెట్ ఉండటాన్ని గ‌మ‌నించిన‌ సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అత‌డిని పోలీసులకు అప్పగించారు. కాటమ్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అత‌డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాటమ్ రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.   
వేస‌వి సెల‌వుల్లో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

వేస‌వి సెల‌వుల్లో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

కార్పొరేట్ విద్యా సంస్థ‌ల్లో వేసవి సెలవుల్లో తరగతుల నిర్వహణ ఏటా గుట్టుగా కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెబుతున్నా పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌పై త‌నిఖీ బృందాలు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. పాఠశాలలకు, క‌ళాశాల‌ల‌కు వేసవి సెలవులు ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర‌ మంత్రి గంటా శ్రీనివాస రావు హెచ్చరించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు.   
అద్భుతమైన ఫీచర్ తో ‘వీవో వై53ఐ’ ఫోన్ విడుదల

అద్భుతమైన ఫీచర్ తో ‘వీవో వై53ఐ’ ఫోన్ విడుదల

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై53ఐ ని సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో సెల్ఫీ కెమెరా ద్వారా ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. 5 ఇంచ్ డిస్‌ప్లే గల ఈఫోన్ లో 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రూ.7,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బ‌చావో అన్న‌దెవ‌రో తెలుసా?

బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బ‌చావో అన్న‌దెవ‌రో తెలుసా?

బేటీ బచావో, బేటీ పడావో అన్నది మోదీ పాత నినాదమని, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బచావో అంటున్నారని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ ఇవాళ ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో రాహుల్ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో సుమారు రెండు కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నారన్నారు. తమ మనసుల్లో ఏముందో 2019లో ప్రజలు మన్‌కీ బాత్ ద్వారా వెల్లడిస్తారని చ‌మ‌త్క‌రించారు.