Short News

ఉద్యోగుల పాత్ర మరువలేనిది, ప్రగతిపథంలో వాళ్లే కీలకం: ఉద్యోగు

ఉద్యోగుల పాత్ర మరువలేనిది, ప్రగతిపథంలో వాళ్లే కీలకం: ఉద్యోగు

ఉద్యోగుల శ్రమతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల సమస్యలపై ప్రగతిభవన్ లో మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామని.. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుదల అద్భుతంగా ఉందని.. దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను విజయవంతంగా ప్రక్షాళన చేశామని అన్నారు. రాష్ర ప్రగతిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది అన్నారు.

శ్రీవారి స‌ర్వ ద‌ర్శ‌నానికి 24 గంట‌లు

శ్రీవారి స‌ర్వ ద‌ర్శ‌నానికి 24 గంట‌లు

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల తాకిడితో క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంతో పాటు ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని దర్శించుకునే భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోండగా, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వ దర్శనానికి పది గంటల సమయం పడుతోంది.   
ప్ర‌భుత్వంపై 73.47%  ప్ర‌జ‌లు సంతృప్తి!

ప్ర‌భుత్వంపై 73.47% ప్ర‌జ‌లు సంతృప్తి!

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి శాతం మరింత పెరిగిందని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెర్స్ స‌ర్వే పేర్కొంది! నెల రోజుల వ్యవధిలో దాదాపుగా 10% మేర పుంజుకుంది. కర్ణాటక పరిణామాలు, తెలుగువారంతా కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కటి అయ్యారన్న భావన.. ఇవన్నీ కలిసి సంతృప్తి శాతాన్ని మరింత పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రానికి వ్యతిరేకంగా ఉండాలన్న భావావేశం క్రమంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారుతోంది. 24.41 లక్షల మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్ర స్థాయి సంతృప్తి సగటు 73.47% గా ఉంది.    
అబూ స‌లేమ్‌ను దోషిగా పేర్కొన్న కోర్టు

అబూ స‌లేమ్‌ను దోషిగా పేర్కొన్న కోర్టు

గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేమ్ ను 2002 దోపిడీ కేసులో ఢిల్లీకి చెందిన పటియాలా కోర్టు దోషిగా తీర్పు చెప్పింది. 2002లో దక్షిణ ఢిల్లీలోని అశోక్‌ గుప్తా అనే వ్యాపారి నుంచి అబూసలేం రూ.5 కోట్లు డిమాండ్‌ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అతడిని దోషిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. అయితే గుప్తా నుంచి తాను డబ్బు డిమాండ్‌ చేయలేదని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు లేవని అబూ సలేమ్‌ కోర్టులో వాదించాడు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more