Short News

మోదీకి  పొదుపు పాఠాలు చెప్పిన వరంగల్ మహిళ

మోదీకి పొదుపు పాఠాలు చెప్పిన వరంగల్ మహిళ

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సభ్యురాలు కౌసర్ షాహిన్ బేగంకు అరుదైన అవకాశం లభించింది. ప్రధాన మంత్రి జన్‌సంవాద్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ వర్గానికి చెందిన మహిళలతో ముచ్చటించారు. ఈ క్రమంలో మోదీతో ముచ్చటించే అవకాశం కౌసర్ షాహిన్‌కు లభించింది. ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కౌసర్.. ప్రధానితో ముచ్చటించారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో మహిళలు పొదుపు పాఠాలు చెప్పిన కౌసర్.. ఎంతో మంది మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు.
ప్రకాష్‌రాజ్‌ వాయిస్ ఓవర్ తో 'సాక్ష్యం'

ప్రకాష్‌రాజ్‌ వాయిస్ ఓవర్ తో 'సాక్ష్యం'

బెల్లంకొండ శ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'సాక్ష్యం'. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నరు ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. చిత్రంలోని కథ ప్రకాష్‌రాజ్‌ గళంతో ముందుకు నడుస్తుంటుంది. 'కర్మ సిద్ధాంతం నేపథ్యంలో సాగే చిత్రమిది. కథనం చాలా కీలకం. ఇలాంటి చిత్రాల్లో వాయిస్‌ ఓవర్‌ ముఖ్యభూమిక పోషిస్తుంది. దర్శకుడు సంప్రదించడంతో ప్రకాష్‌రాజ్‌ ఒప్పుకొని తన గళాన్ని అందించారు' అని చిత్రవర్గాలు తెలిపాయి.
1800 వాట్స‌ప్ గ్రూపుల్లో అమిత్ షా స‌భ్యుడ‌య్యారు

1800 వాట్స‌ప్ గ్రూపుల్లో అమిత్ షా స‌భ్యుడ‌య్యారు

పార్టీ నేతలు, కార్యకర్తలకు నేరుగా సమాచారం అందించేందుకు దిల్లీ భాజపా వందల కొద్దీ వాట్సాప్‌ గ్రూప్‌లు రూపొందించింది. భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఈ గ్రూప్స్‌లో నేరుగా సభ్యుడిగా ఉన్నారు. నకిలీ వార్తలు అరికట్టేందుకు పార్టీ ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దిల్లీ భాజపా నేతలు మండల స్థాయి నుంచి బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ కార్యాలయాల్లో పనిచేసే వాళ్లు, వివిధ స్థాయిల్లోని నేతలను అందరినీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలోని గ్రూప్స్‌లో చేర్చుతున్నారు.
సామాన్యుడిపై జీఎస్టీ భారం త‌గ్గించిన కేంద్రం

సామాన్యుడిపై జీఎస్టీ భారం త‌గ్గించిన కేంద్రం

అత్యధిక పన్ను శ్లాబులోని పలు వస్తువులను తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌ తెలిపారు. శనివారం జరిగిన జీఎస్టీ 28వ కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రూ.1000 కంటే ఎక్కువ ధర ఉన్న చెప్పులపై వసూలు చేస్తున్న పన్నును 5 శాతానికి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. మిక్సీలు, వాటర్‌ హీటర్లు, హెడ్‌ డ్రైయర్లు, హ్యాండ్‌ డ్రైయర్లలను 28శాతం పన్ను శ్లాబు నుంచి తొలగించిన 18శాతం పన్ను శ్లాబులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. తగ్గించిన పన్ను ధరలు జులై 27 నుంచి అమల్లోకి రానున్నాయి.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more