Short News

తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్

తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్

తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్ ఏర్పాటు కాబోంది. ఎస్సీ విద్యార్థులకు పలు అవకాశాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికోసి సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని ఎస్సీ గురుకుల విద్యాలయాన్ని సైనిక్‌స్కూల్‌గా మార్పుచేసుకునేలా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌కు అనుమతి ఇచ్చింది. 2018-19 విద్యాసంవత్సరంలోనే ప్రారంభం కానున్న ఈ సైనిక్ స్కూల్ తెలంగాణలో ఏర్పాట వుతున్న మొట్టమొదటి సైనిక్‌స్కూల్ చరిత్రలో నిలిచిపోనుంది.
తెలుగోళ్ళు  అందాల 'బొమ్మ'గానే చూపించారు

తెలుగోళ్ళు అందాల 'బొమ్మ'గానే చూపించారు

'దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నడుము సుందరి 'ఇలియానా'. తెలుగు పరిశ్రమ తనను అందాల వస్తువుగానే చూసిందని ఆవేదనగా చెప్పింది. ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ నాలుగైదు చిత్రాల తర్వాత కూడా తనను అందాల వస్తువుగానే చూపించడం ఇబ్బందికరంగానూ, బాధగానూ అనిపించినట్లు చెప్పింది. అసలు ఆట సినిమా చేయకూడదనుకున్నట్లుగా తెలిపిన ఈ గోవా భామ జల్సా, కిక్ చిత్రాలకు మంచి మార్కులేసింది.  
సంచలనం: హైదరాబాద్ సెలబ్రిటీని లేపేందుకు దావూద్ సుపారీ?, ఎవరత

సంచలనం: హైదరాబాద్ సెలబ్రిటీని లేపేందుకు దావూద్ సుపారీ?, ఎవరత

భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ ఇబ్రహీం ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఆ సెలబ్రిటీని హత్య చేసేందుకు దావూద్ నమ్మిన బంటు చోటా షకీల్‌‌తో రూ.45 లక్షల ఒప్పందం కుదిరిందని పోలీసుల అదుపులో ఉన్న నసీం వెల్లడించాడు. అయితే ఆ సెలబ్రిటీ ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. బహుశా సినీ రంగానికి చెందిన వ్యక్తే అయి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓ సెలబ్రిటీని చంపేంత అవసరం దావూద్ కు ఏమొచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న.

హైదరాబాదులో సెలబ్రిటీని చంపాలకున్న దావూద్

హైదరాబాదులో సెలబ్రిటీని చంపాలకున్న దావూద్

దావూద్‌ ఇబ్రహీం హైదరాబాదులో ఓ సెలబ్రిటీని చంపేందుకు షూటర్ ని రంగంలోకి దించడం కలకలం రేపుతోంది. గత నవంబర్లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు షార్ప్‌ షూటర్‌ నసీం అలియాస్‌ రిజ్వాన్‌ ను అరెస్టు చేయగా, ఢిల్లీ స్పెషల్ పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఈ విచారణలో హైదరాబాదులో ఒక సెలబ్రిటీని డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిందన్న విషయాన్ని నసీం బయటపెట్టాడు. హైదరాబాదులో ఆ సెలబ్రిటీని చంపేందుకు చోటా షకీల్‌ తో 45 లక్షలకి ఒప్పందం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.