Short News

మక్కా పేలుళ్ళలో దోషులెవరు: సర్వే సత్యనారాయణ

మక్కా పేలుళ్ళలో దోషులెవరు: సర్వే సత్యనారాయణ

మక్కా మసీదు పేలుళ్ళ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను నిర్ధోషులుగా సోమవారం నాడు ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక తీర్పుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ కేసులో సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో కేంద్రం వైఫల్యం చెందిందని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అన్ని మతాలను గౌరవించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మక్కా పేలుళ్ళ కేసులో కోర్టు తీర్పు అనంతరం సోమవారం నాడు హైద్రాబాద్‌లో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

ధోనీ ఆడుతుంటే సాక్షి సంబరాలు ..అనుష్క ఆందోళన

ధోనీ ఆడుతుంటే సాక్షి సంబరాలు ..అనుష్క ఆందోళన

ఐపీఎల్‌లో క్రికెటర్ల భార్యలు సందడి చేస్తున్నారు. విరాట్‌ కోహ్లీ, ధోనీ, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మల భార్యలు గ్యాలరీలో కూర్చుని తమ భర్త ఆడే జట్టును ప్రోత్సహిస్తున్నారు. తాజాగా బెంగళూరు-చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌కి కోహ్లీ భార్య అనుష్క శర్మ, ధోనీ భార్య సాక్షి హాజరయ్యారు. ఈ మ్యాచ్‌కు హాజరైన వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాయుడుతో కలిసి ధోనీ బౌండరీల మోత మోగిస్తుంటే  అనుష్క ఆందోళన చెందుతూ కనిపిస్తే సాక్షి మాత్రం సంతోషంగా కనిపిస్తూ చెన్నైను ప్రోత్సహిస్తూ ఉంది.
భారత ఆటగాళ్ళలో మూడో సారధిగా 'కోహ్లీ'

భారత ఆటగాళ్ళలో మూడో సారధిగా 'కోహ్లీ'

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్ కోహ్లీ అత్యధిక టీ20లకు నాయకత్వం వహించిన ఆటగాళ్ళ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో కోహ్లీ ఎనిమిదో వాడు. బుధవారం బెంగళూరు - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌తో కోహ్లీకి వంద మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. ఈ జాబితాలో ధోనీ 244 మ్యాచ్ లతో అగ్రస్థానంలో ఉండగా గౌతమ్‌ గంభీర్‌ 170 మ్యాచ్ లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకూ కోహ్లీ 234 టీ20లు ఆడగా 57 మ్యాచ్‌లు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.  
క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవజ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రమంతటికీ ఒకటి, నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి వామన్‌ ఆచార్య తెలిపారు. మంగళూరులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్య నేతృత్వంలో జేడీఎస్ మ్యానిఫెస్టో రూపొందించ‌నుంది.