Short News

కేటీఆర్ చొరవ: ఆదిభట్లలో జీఈ-టాటా ఏరో ఇంజిన్ల పరిశ్రమకు శంకుస్థాపన(పిక్చర్స్)

కేటీఆర్ చొరవ: ఆదిభట్లలో జీఈ-టాటా ఏరో ఇంజిన్ల పరిశ్రమకు శంకుస్థాపన(పిక్చర్స్)

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చేస్తున్న కృషి ఫలిస్తోంది. తాజాగా వైమానిక రంగంలో ప్రసిద్ధ సంస్థలైన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) సంస్థల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని ఆర్థికమండలిలో వైమానిక ఇంజిన్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి సోమవారం మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

కల్యాణ్ రామ్ కు క్లాప్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

కల్యాణ్ రామ్ కు క్లాప్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

బుధవారం నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈసినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు.  మే 2 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. శేఖర్‌ చంద్ర సంగీతం అందించనున్నారు. ఇందులో కల్యాణ్‌రామ్‌కు జోడీగా నివేదా థామస్‌, షాలిని పాండే నటించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేవీ గుహన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
Instagram వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..

Instagram వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..

ఆన్‌లైన్ ఫోటో షేరింగ్ విభాగంలో అగ్రగామి యాప్‌గా గుర్తింపుతెచ్చుకన్న ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త కస్టమర్‌ల తాకిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సెప్టంబర్ 2017లో టెక్‌క్రంచ్ రివీల్ చేసిన పలు రిపోర్ట్స్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ సేవలను ప్రతి నెలా 80 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. ఇక యాక్టివ్ యూజర్ల విషయానికి వచ్చేసరికి ప్రతి రోజు ఈ యాప్‌ను 50 కోట్ల మంది యాక్టివ్‌గా వినియోగించుకుంటున్నట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

మీ పాస్‌వర్డ్‌ దొంగిలించారో లేదో ఇలా తెలుసుకోండి

మీ పాస్‌వర్డ్‌ దొంగిలించారో లేదో ఇలా తెలుసుకోండి

మీ మెయిల్ ఐడీ పాస్ వర్డ్ ఎవరైనా దొంగిలించారా..? ఒక వేళ దొంగిలిస్తే  తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే సింపుల్. మరి మీ పాస్‌వర్డ్ ఎవరికైనా తెలుసో లేదో ఇలా చెక్ చేసుకోండి. Troy Hunt Have I Been Pwnedను గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో టైప్ చేస్తే.. సంబంధిత వెబ్‌సైట్ వస్తుంది. దానిలో మీ మెయిల్ ఐడీని టైప్ చేసి pwned మీద ఎంటర్ చేస్తే మీ పాస్‌వర్డ్ హ్యాక్ అయిందా? లేదా? తెలుస్తుంది. ఎవ్వరూ దొంగిలించకపోతే గుడ్‌న్యూస్ అని గ్రీన్ కలర్‌లో, ఎవరైనా దొంగిలిస్తే ఓ నో-pwned అని బ్రౌన్ కలర్‌లో కింద కనిపిస్తుంది.