Short News

సిటీ ఉగ్రవాదులకు అడ్డా మారుతోంది: లక్ష్మణ్ ఆందోళన

సిటీ ఉగ్రవాదులకు అడ్డా మారుతోంది: లక్ష్మణ్ ఆందోళన

గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌ నగరం ఉగ్రవాదులకు రహస్య స్థావరంగా మారుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. దేశంలో ఎక్కడ దాడులు జరిగినా హైదరాబాద్‌లోనే మూలాలు ఉంటున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోమవారం జరిపిన దాడుల్లో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. పాతబస్తీలో మజ్లిస్ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో చొరబాటు దారులు యథేచ్ఛగా నివసిస్తున్నారని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కేరళ వరదలు: వీపునే మెట్టుగా మార్చిన మత్స్యకారుడు

కేరళ వరదలు: వీపునే మెట్టుగా మార్చిన మత్స్యకారుడు

కేరళ వరద బాధితులను ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్‌లతో పాటు మత్స్యకారులు, ఆరెస్సెస్ కూడా సహాయం అందిస్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు టోపీ లేని మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యంతో పాటు స్థానిక మత్స్యకారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.మత్స్యకారులు కూడా ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతున్నారు. ఓ వృద్ధురాలిని కాపాడేందుకు ఓ మత్స్యకారుడు తన వీపునే మెట్టుగా మార్చాడు.ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అతడు అందించాడు. తనూర్‌కు చెందిన జైసల్‌ కేపీ మత్స్యకారుడు.

శ్రావణంలో మంచి ముహూర్తాలు మొదలయ్యాయి పెళ్లి చేసేసుకోండి

శ్రావణంలో మంచి ముహూర్తాలు మొదలయ్యాయి పెళ్లి చేసేసుకోండి

గస్టు 15 2018 నుంచి వచ్చే నెల అంటే సెప్టెంబర్‌ లో 3వ తేదీ వరకు గ్రుహ ప్రవేశాలకు అనుకూలం. ఇక సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్‌ 10 వ తేదీ వరకు శూన్యమాసం ఉండనుంది. దీంతో అప్పుడు ఎలాంటి శుభ కార్యాలు చేసుకోవడానికి వీలుండదు. దీంతో జనాలంతా ఈ నెలలోనే శుభకార్యాలతో బిజీబిజీ అయిపోనున్నారు. సో.. మీ ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం ఉంటే ఈ నెలంతా మీకు శుభకార్యాలకు కావాల్సిన వస్తువులు దొరికే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తుగానే మీరు అన్నీ బుక్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సింది వస్తుంది.

నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి

నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇలానే.. న్యాయమా? తల్లి రొమ్ము గుద్దడమే: చిరంజీవి

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా పరశురాం దర్శకత్వంలో న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'గీత గోవిందం' పైరసీ గురించి ప్రస్తావించారు. సినిమా విడుదల ముందు ఈ చిత్రాన్ని కొందరు టెక్నీషియన్స్ దొంగిలించి తమ స్నేహితులతో పంచుకోవడం, రిలీజ్ ముందే సినిమా లీక్ కావడంతో నిర్మాతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని పలువురిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more