Short News

మెట్రో రైలు సర్వీసు వేళల్లో స్వల్ప మార్పులు

మెట్రో రైలు సర్వీసు వేళల్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసు వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వారాంతాల్లో శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో సర్వీసు 6.30 గంటలకు ప్రారంభం అవుతదని...ఆదివారం నాడు ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే రైలు సర్వీసు 7 గంటలకు ప్రారంభకానున్నట్లు వెల్లడించారు. కాగా రోజులో చివరి సర్వీసు వేళల్లో ఎటువంటి మార్పులు లేవు. యథావిథిగానే ఉన్నాయి. ఈ మార్పులు కూడా తాత్కాలికమేనని అధికారులు చెప్పారు. ఈ మార్పులు వచ్చే సోమవారం నుంచి అమల్లో ఉండనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన టీడీపీ

కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీల సాధన కోసం టీడీపీ మళ్లీ కేంద్రంపై అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది. మంగళవారం తాజాగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ సీఎం చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెదేపా ఎంపీ నాని కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. రేపు జరిగే సభా కార్యకలాపాల జాబితాలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు.   
బాడీ మసాజ్ కు ఈ నూనెలు ఎంతో ఉత్తమం.!

బాడీ మసాజ్ కు ఈ నూనెలు ఎంతో ఉత్తమం.!

బాడీ మసాజ్ వల్ల మీరు తక్షణ ఉపశమనం పొందడంతో పాటు మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. కానీ, ఈ బాడీ మసాజ్ కు కొంచెం గోరువెచ్చని నూనెను చేర్చడంతో ఒక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బాడీ ఆయిల్ మసాజ్ తో అనేక ప్రయోజనాలున్నాయి. ఉదా: ఇది మనస్సును మరియు శరీరాన్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మరియు చర్మంలో రక్తప్రసరణను పెంచి, చర్మం టైట్ గా మారేలా చేస్తుంది. ఆయిల్ మసాజ్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి మీకు పొడి చర్మం ఉన్నప్పుడు మరియు మీ వదులైన చర్మాన్ని నివారించాలన్నా మీరు కనీసం వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకోవాలి

జగన్‌తో ఆనం భేటీపై వివేకా కుమారుడి స్పందన

జగన్‌తో ఆనం భేటీపై వివేకా కుమారుడి స్పందన

తమ కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతోందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తోందని అసత్య ప్రచారం సాగుతోందని, అదంతా వట్టిదేనని ఆనం వివేకానంద రెడ్డి తనయుడు ఆనం రంగమయూర్ రెడ్డి అన్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లుగా వస్తున్న పుకార్లు అవాస్తవమని చెప్పారు. జగన్‌తో తాము ఎవరం కూడా టచ్‌లో లేమని తేల్చి చెప్పారు. తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి మేయర్ పదవులు ఇస్తారంటూ ప్రచారం సాగుతోందని, కానీ అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తమకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more