Short News

కేటిఆర్ కు కోన వెంకట్ ఫిర్యాదు

కేటిఆర్ కు కోన వెంకట్ ఫిర్యాదు

విడుదలైన ప్రతి సినిమాను కొన్ని గంటల్లోనే మూవీ రూల్స్ వెబ్ సైట్ లో ప్రత్యక్షమవుతోందని.. ఆ వెబ్ సైట్ ను మూయించాలని మంత్రి కేటిఆర్ కు సినీ రచయిత కోన వెంకట్ ఫిర్యాదు చేశారు. ఆ వెబ్ సైట్ వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారని ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేశారు. వెబ్ సైట్ ను లాక్ చేయించి తెలుగు సినిమా పరిశ్రమను కాపాడాలని కోరారు. రిసెంట్ గా రిలీజ్ అయిన సినిమా మూవీ రూల్స్ లో ఉన్న ఫొటోను కోనా వెంకట్ షేర్ చేశారు.
పెళ్లి వేడుకలో శ్రీదేవి, ఖుషి, మహేష్ హీరోయిన్ కైరా అడ్వాని సందడి (ఫోటోస్)

పెళ్లి వేడుకలో శ్రీదేవి, ఖుషి, మహేష్ హీరోయిన్ కైరా అడ్వాని సందడి (ఫోటోస్)

బాలీవుడ్ హీరో మోహిత్ మార్వా పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. మోహిత్ తన ప్రియురాలు ఆంత్ర మోతివాలను పెళ్లాడ బోతున్నారు. ఆల్రెడీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ యూఏఈలో ప్రారంభం అయ్యాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు అర్జున్ కపూర్, మనీష్ మల్హోత్రా, సిద్ధాంత్ కపూర్, రియా కపూర్, శ్రీదేవి, ఖుషి కపూర్, కైరా అడ్వాని తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. వీరితో పాటు బోనీ కపూర్, హర్షవర్దన్, సోనమ్ కపూర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. మోహిత్ మార్వా, ఆంత్ర మోతీవాలా చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇద్దరూ ఎట్టకేలకు వివాహంతో ఏకం కాబోతున్నారు.

రేపు కమల్ రాజకీయ యాత్ర వేదిక మారనుందా..?

రేపు కమల్ రాజకీయ యాత్ర వేదిక మారనుందా..?

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ రేపే రాజ‌కీయ పార్టీ పేరును ప్ర‌క‌టించనున్నారు. తన రాజకీయ యాత్రను ప్రారంభించేందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చదివిన స్కూల్ ను వేదిక‌గా ఎంచుకున్నారు. రామేశ్వరం ఐలాండ్‌లో నంబర్ 1 మండపం పంచాయత్ యూనియన్ మిడిల్ స్కూల్ నుంచి రాజకీయ యాత్రను ప్రారంభించడాన్ని హిందూ మున్నాని వ్యతిరేకిస్తుంది. కమల్‌హాసన్ రాకూడంగా నిలిపేయాలని హిందూ మున్నాని జిల్లా కార్యదర్శి పి రామమూర్తి కలెక్టర నటరాజన్‌కు ఓ లేఖ రాశారు. సినీ నటులు స్కూళ్లను రాజకీయ వేదికలుగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని హిందూ మున్నాని లేఖలో పేర్కొంది.
బెంగళూరులో కార్యాలయంలో పెట్రోల్ చల్లిన కాంగ్రెస్ లీడర్, సీఎం

బెంగళూరులో కార్యాలయంలో పెట్రోల్ చల్లిన కాంగ్రెస్ లీడర్, సీఎం

బెంగళూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హ్యారీస్ కుమారుడు మోహమ్మద్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన వెంటనే అదే పార్టీకి చెందిన మరో నాయకుడి బరితెగింపు బయటకు వచ్చింది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడి అధికారులు, సిబ్బంది అక్కడే ఉన్న సమయంలో పెట్రోల్ చల్లి నిప్పటించడానికి ప్రయత్నించిన వీడియో బయటకు వచ్చి వైరల్ కావడంతో సీఎం సీరియస్ అయ్యారు.బెంగళూరు నగరంలోని కేఆర్ పురం శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (కాంగ్రెస్) భైరతి బసవరాజ్ కు ప్రధాన అనునచరుడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణస్వామి గుర్తింపు తెచ్చుకున్నాడని సమాచారం.