Short News

ఆ ఊరినిండా ప్రేమ పెళ్ళిళ్లే

ఆ ఊరినిండా ప్రేమ పెళ్ళిళ్లే

ప్రేమ వివాహాలంటే పెద్దలు ఒప్పుకోరు. పారి పోయి పెళ్లి చేసుకున్నవి ప్రతి ఊరిలో పది, ఇరవై దాకా ఉంటాయి. కానీ ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో కలకోట గ్రామంలో ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువ. అన్ని పెళ్లిళ్లు పెద్దల ఆధ్వర్యంలో జరిగినవే కావడం విశేషం. వారంతా పిల్లాపాపలతో కలిసి హాయిగా ఉంటున్నారు. వందకు దగ్గర్లో పెళ్లిళ్లు జరిగాయంటున్నారు ఊరి పెద్దలు. కలకోటగా పిలువబడుతున్న గ్రామం... ఇప్పుడు ప్రేమ కోటగా మారిపోయింది.
న‌క్సల్స్ చ‌ర్య‌ల‌తో గిరిజ‌నుల్లో ఆందోళ‌న‌

న‌క్సల్స్ చ‌ర్య‌ల‌తో గిరిజ‌నుల్లో ఆందోళ‌న‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం పెడమిడిసిలేరు-తాలిపేరు ప్రాజెక్టు మధ్యగల కాజ్‌వేని నిషిద్ధ మావోయిస్టు నక్సలైట్లు ధ్వంసం చేశారు. దీంతో సమీప గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా ఏజెన్సీలో నక్సలైట్లు ఏదో ఒక సంఘటనకు పాల్పడుతూ తమ ఉనికి చాటుకుంటున్నారు. పక్కనే ఉన్న దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఇప్పటికే ఆయా ఘటనలకు పాల్పడ్డ నక్సలైట్లు తాజాగా కాజ్ వే ను ధ్వంసం చేయడంతో గిరిజన ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.   
కల్యాణ్ రామ్ కు క్లాప్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

కల్యాణ్ రామ్ కు క్లాప్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

బుధవారం నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈసినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు.  మే 2 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. శేఖర్‌ చంద్ర సంగీతం అందించనున్నారు. ఇందులో కల్యాణ్‌రామ్‌కు జోడీగా నివేదా థామస్‌, షాలిని పాండే నటించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేవీ గుహన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
Instagram వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..

Instagram వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..

ఆన్‌లైన్ ఫోటో షేరింగ్ విభాగంలో అగ్రగామి యాప్‌గా గుర్తింపుతెచ్చుకన్న ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త కస్టమర్‌ల తాకిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సెప్టంబర్ 2017లో టెక్‌క్రంచ్ రివీల్ చేసిన పలు రిపోర్ట్స్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ సేవలను ప్రతి నెలా 80 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. ఇక యాక్టివ్ యూజర్ల విషయానికి వచ్చేసరికి ప్రతి రోజు ఈ యాప్‌ను 50 కోట్ల మంది యాక్టివ్‌గా వినియోగించుకుంటున్నట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.