Short News

రేపటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

రేపటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఈ నెల 17వ తేదీ నుంచి మే 1 వరకు తెలంగాణలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి.  పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30గంటల నుంచి 11:30గంటల వరకు నిర్వహించబడుతాయన్నారు. ఈ పరీక్షల నిమిత్తం ఏడుగురు చీఫ్ సూపరింటెండెంట్‌లు, ఏడుగురు డిపార్ట్‌మెంటల్ అదికారులు, 12 మంది కస్టోడియన్లు, 112 ఇన్విజిలేటర్లు నియమించడం జరిగిందన్నారు.
ఉచితంగా 'హార్లీ డేవిడ్సన్‌' బైక్

ఉచితంగా 'హార్లీ డేవిడ్సన్‌' బైక్

ప్రముఖ బైక్‌ల కంపెనీ హార్లీ డేవిడ్సన్‌ 'హార్లీ డేవిడ్సన్‌' బైక్‌ని ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ వేసవిలో హార్లీ డేవిడ్సన్‌ కంపెనీలో 12వారాల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ఎంపికైన అభ్యర్థులకు ఒక బైక్‌ను ఇస్తారు. అభ్యర్థులు ఈ బైక్‌ల మీద విహరించి తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు బైక్‌ని ఎలా నడపాలి అనే విషయంలో శిక్షణ ఇవ్వడమే కాక వారికి ప్రయాణ ఖర్చులతో పాటు వేతనాన్ని కూడా చెల్లిస్తారు. 18 ఏళ్ళు నిండిన పట్టభద్రులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది 2018, మే 11.  
రామ మందిరం తీర్పు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతులు!

రామ మందిరం తీర్పు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతులు!

బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం కేసులో సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతి దళాలు (బలిదానీ దాస్తా) రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనంత వరకు ఈ దళాలు ముందుకు రావు, అయితే వాటికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అని లక్నోలో ఆయన మీడియాతో చెప్పారు. బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా ఉన్న ఇక్బాల్ అన్సారీకి ఈ వివాదంపై పూర్తి అవగాహన లేదని కటియార్ చెప్పారు. కటియార్ బాబ్రీ మసీదు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.    
పదిమందితో జియో ఫోన్ కొనిపిస్తే ..112 జీబీ డేటా ఉచితం

పదిమందితో జియో ఫోన్ కొనిపిస్తే ..112 జీబీ డేటా ఉచితం

రిలయన్స్‌ జియో వినియోగదారులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించింది. ఈసారి ఉచిత డేటా ఆఫర్‌ ప్రకటించింది. 'జియో ఫోన్‌ మ్యాచ్‌ పాస్‌' ఆఫర్లో వినియోగదారులు మరో 10మంది చేత జియో ఫోన్లను కొనిపిస్తే 112 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుతుంది. 10మంది స్నేహితులు లేదా, బంధువులను జియో ఫోన్‌ కొనుగోలు చేయించాల్సి ఉంటుంది. 1800-890-8900 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి జియో ఫోన్‌పై ఆసక్తి ఉన్న స్నేహితుల గురించి సమాచారం ఇవ్వాలి.