Short News

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో కీలకంగా ప్రకాశ్ రాజ్ పాత్ర

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో కీలకంగా ప్రకాశ్ రాజ్ పాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటూ థర్డ్‌ఫ్రంట్(ఫెడరల్ ఫ్రంట్) కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌లతో కేసీఆర్ భేటీ అయి థర్డ్‌ఫ్రంట్ పై చర్చించారు. తాజాగా, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ ఏర్పాటు చేయబోయే ఫ్రంట్‌లో ప్రకాశ్ రాజ్ కీలక భూమికి పోషించనున్నట్లు తెలుస్తోంది.

మరో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

మరో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్‌ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సల్స్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్‌ షెలార్‌ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం ఆరుగురు మరణించారని చెప్పారు.

నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్

నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్

'సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌(రాజ్యాంగ పరిరక్షణ)' ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ సవాలు విసిరారు రాహుల్. రాహుల్‌ గాంధీ సోమవారం 'సేవ్‌ ది కన్‌స్టిట్యూషన్‌' కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ' ప్రధాని మోడీ నన్ను పార్లమెంటులో ఎదుర్కోలేరు. నాతో కనీసం 15 నిమిషాల పాటు చర్చకు కూడా ధైర్యం చేయలేరు. ఇప్పుడు ఆయన దృష్టంతా మళ్లీ ప్రధాని కావడం మీదే ఉంది. మోడీజీ నాతో చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ రాహుల్ గాంధీ సవాల్‌ విసిరారు.

లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి లోకేష్‌కు టెక్నాలజీపై మంచి పట్టుందని చెప్పారు. మ‌న ఐటీ మంత్రి ప్రొఫెషనల్‌ అని, ఐటీలో లోకేష్‌కు మంచి పట్టుందని చెప్పారు. తాను మేనేజర్, లీడర్‌ను మాత్రమేనని.. సూచనలు ఇస్తుంటానని చెప్పారు. సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఐటీ వేదికగా నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.