Short News

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ లో ప్రసంగించనున్న మరమనిషి

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ లో ప్రసంగించనున్న మరమనిషి

ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ జరగనుంది. ఈ కార్యక్రమంలో మరమనిషి ‘సోఫియా' తన ప్రసంగాన్ని వినిపించనుంది. ఈ రోబో మనుషుల తరహాలో మాట్లాడడమే కాక ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. ఈ వేదికపై భారత ప్రధాని మోదీ, శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే,తదితరులు మాట్లాడనున్నారు. హాంకాంగ్‌కు చెందిన హన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ నటి 'ఆడ్రే హెప్‌బర్న్‌' రూపురేఖలతో సోఫియాను రూపొందించారు.  
మహిళపై ముఖ్యమంత్రి అత్యాచారం ..?

మహిళపై ముఖ్యమంత్రి అత్యాచారం ..?

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపిస్తుంది. సీఎం నాపై అత్యాచారం చేశాడంటే ప్రజలు కానీ పోలీసులు కానీ నమ్మలేద‌ని చెబుతోంది. త‌న‌పై అత్యాచారం జరిగినప్పుడు పేమా ఖండూ సీఎం పదవిలో లేడంటోంది. ఇప్పుడు ఆయ‌న‌ సీఎం ప‌ద‌విలో ఉండ‌టంతో త‌న మాటలు ఎవ్వరూ నమ్మడం లేదని వాపోతుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. న్యాయం కోసం నా తుదిశ్వాస వరకూ పోరాడుతూనే ఉంటాను అని బాధితురాలు తెలిపింది.
అది చివరి అస్త్రం: పవన్ కళ్యాణ్-జగన్‌లకు చంద్రబాబు, రాజీనామా అంటే ఎలా

అది చివరి అస్త్రం: పవన్ కళ్యాణ్-జగన్‌లకు చంద్రబాబు, రాజీనామా అంటే ఎలా

అవిశ్వాస తీర్మానం అంశంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. అవిశ్వాసం చివరి అస్త్రంగా మాత్రమే ఉండాలని చెప్పారు. అన్ని ప్రయత్నాలు విఫలమైతే దానికి తాము సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడున్నరేళ్లుగా ఎదురు చూశామని చంద్రబాబు చెప్పారు. అన్ని ప్రయత్నాల తర్వాత అవసరమైతే అవిశ్వాసం పెడతామని చెప్పారు. అవిశ్వాసం కోసం 54 మంది ఎంపీల మద్దతు అవసరమని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందంటే దేనికైనా సిద్ధమని చెప్పారు. ఎంపీలు రాజీనామా చేయాలని చెబుతున్నారని, అలా చేస్తే పార్లమెంటులో మనకు ఇచ్చిన హామీలపై ఎలా పోరాడుతామన్నారు.

చెన్నైలో దాడి: ఆంధ్రా టెక్కీ లావణ్య ఏడ్చినా కాపాడేందుకు రాలేదు! ముగ్గురి అరెస్ట్

చెన్నైలో దాడి: ఆంధ్రా టెక్కీ లావణ్య ఏడ్చినా కాపాడేందుకు రాలేదు! ముగ్గురి అరెస్ట్

గత మంగళవారం చెన్నైలోని తలంబూరు - పేరుంబాక్కమ్ రోడ్డులో అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో దొంగల దాడిలో గాయపడిన లావణ్య మాట్లాడుతూ.. తనపై దాడి జరిగిన సమయంలో తాను ఏడుస్తూ, అరిచినా సాయం చేసేందుకు కొందరు ముందుకు రాలేదన్నారు. తాను గాయపడి అక్కడ పడి ఉన్నప్పటికీ అటు నుంచి అటు వెళ్తున్న కొందరు వ్యక్తులు, ఇతరులు పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత గాయపడ్డ ఆమెకు ఇద్దరు వ్యక్తులు సహకరించారు. అందులో ఒకరు 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. మరొకరు పోలీసులకు సమాచారం అందించారు.