పొద్దున్న ఎండలు.. సాయంత్రం జల్లులు
తెలంగాణ
- 9 days ago
ఉదయం పూట ఆకాశంలో కారు మబ్బులు.. 11 గంటలు దాటగానే సూర్యుడి ప్రతాపంతో రోడ్లన్నీ నిర్మానుష్యం! మళ్లీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి వడగళ్ల వాన. ప్రస్తుతం తెలంగాణ ఇదీ వాతావరణ పరిస్థితి. వారం రోజులుగా రాష్ట్రంలో ఒకే రోజు వానా కాలం, ఎండాకాలం అనుభూతి కలుగుతోంది. 15 రోజుల క్రితం వరకు రాత్రిపూట చలి, ఉదయం ఎండా ఉండేది. అకస్మాత్తుగా మారిన మిశ్రమ వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు ఇప్పటికే 38 డిగ్రీలకు చేరుకున్నాయి.