Short News

'మాతో ఉన్నామంటూ ఇలాగా, అనుభవం లేదు'

'మాతో ఉన్నామంటూ ఇలాగా, అనుభవం లేదు'

తెలుగుదేశం పార్టీపై బీజేపీ శాసన మండలి సభ్యులు మాధవ్ మంగళవారం మండిపడ్డారు. సెంటిమెంటుతో పనులు జరగవని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారని, తెలంగాణ ఇచ్చారుగా అని చంద్రబాబు అంతకుముందు విమర్శించారు. కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. ఓ వైపు తాము ఎన్డీయేలోనే ఉన్నామని చెబుతూ మరోవైపు చంద్రబాబు అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

రూ.1,394 కోట్ల యూబీఐ స్కాం: ‘టొటెం’ కంపెనీ డైరెక్టర్లు అరెస్

రూ.1,394 కోట్ల యూబీఐ స్కాం: ‘టొటెం’ కంపెనీ డైరెక్టర్లు అరెస్

వందల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను బెంగళూరులో అరెస్టు చేసినట్టు సమాచారం. మొత్తం 8 బ్యాంకుల కన్సార్టియంను రూ.1394 కోట్ల మేరకు టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మోసగించింది. హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంకును రూ.313.84 కోట్ల మేరకు సదరు సంస్థ మోసగించింది. ఈ మేరకు యూనియన్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఇద్దరు, మరికొందరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

కారుబాంబు పేలుడు: 12 మంది మృతి

కారుబాంబు పేలుడు: 12 మంది మృతి

దక్షిణ ఆఫ్గనిస్థాన్‌లోని లష్కర్గా పట్టణంలో శుక్రవారం కారుబాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా, మరో 40 మందికి పైగా గాయాలైనట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హెల్మెండ్‌ ప్రావిన్స్‌లోని ఘాజీ మహమ్మద్ ఆయూబ్ ఖాన్ క్రీడా మైదానానికి సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. మరోవైపు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆసుపత్రి వర్గాల సమాచారం.

యూపీలో చక్రం తిప్పిన యోగి... 9 సీట్లు గెలుచుకున్న బీజేపీ!

యూపీలో చక్రం తిప్పిన యోగి... 9 సీట్లు గెలుచుకున్న బీజేపీ!

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ 9 సీట్లు గెలుచుకుంది. 8 సీట్లు గెలుచుకున్నట్లు ముందే ప్రకటించారు. 9వ అభ్యర్ధిగా బీఎస్పీ నుంచి తలపడిన భీమ్‌రావ్ అంబేద్కర్ గెలుస్తారని అంతా ఆశించారు. అయితే 9వ సీటును కూడా బిజెపి గెలుచుకుంది. 9వ సీటుకు సంబంధించి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యూహంతో బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీఎస్పీ అభ్యర్ధికి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆశించారు కానీ అలా జరగలేదు.