Short News

అరుదైన అవకాశం: మోడీతో మాట్లాడిన కౌసర్ షాహిన్ బేగం

అరుదైన అవకాశం: మోడీతో మాట్లాడిన కౌసర్ షాహిన్ బేగం

వరంగల్ జిల్లాలోని వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సభ్యురాలు కౌసర్ షాహిన్ బేగంకు అరుదైన అవకాశం లభించింది. ప్రధాన మంత్రి జన్‌సంవాద్ కార్యక్రమంలో భాగంగా గురువారం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) వర్గానికి చెందిన మహిళలతో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఈ క్రమంలో మోడీతో ముచ్చటించే అవకాశం కౌసర్ షాహిన్‌కు లభించింది. గురవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కౌసర్.. ప్రధానితో ముచ్చటించారు. ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని కౌసర్ ఆనందం వ్యక్తం చేశారు.

కత్తి మహేష్ పై చర్యలు తీసుకోండి.. శైవక్షేత్ర పీఠాధీప‌తి శివ‌స్వామి అరెస్ట్

కత్తి మహేష్ పై చర్యలు తీసుకోండి.. శైవక్షేత్ర పీఠాధీప‌తి శివ‌స్వామి అరెస్ట్

టీడీపీ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని, దేవాలయాలను సైతం కూల్చివేస్తూ అక్రమాలకు పాల్పుడుతున్నారని శైవక్షేత్ర పీఠాధీప‌తి శివ‌స్వామి తీవ్ర ఆరోపణల చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన పీఠాధిపతి శివస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శివస్వామి హౌస్‌ అరెస్ట్‌ నేపథ్యంలో శైవక్షేత్రం చుట్టూ పోలీసు బలగాలు మోహరించినా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.
అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఎస్‌బీఐ షాక్‌

అనుబంధ బ్యాంకుల ఉద్యోగులకు ఎస్‌బీఐ షాక్‌

నోట్ల రద్దు సమయంలో అదనపు పనిగంటలకు అందించిన పరిహారం వెనక్కి ఇవ్వాలని ఎస్‌బీఐ నోటీసులు పంపింది. ఏప్రిల్‌ 1, 2017న ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు విలీనమవడం గమనార్హం. అయితే నోట్లరద్దు సమయంలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగలేదని ఎస్‌బీఐ పేర్కొంటోంది. ఆ సమయంలో ఓవర్‌టైమ్‌ చేసినందుకు ఎస్‌బీఐ హామీ ఇచ్చిన మేర పరిహారం చెల్లించింది. అయితే వీరు అదనంగా పనిచేసినందుకు అందుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఎస్‌బీఐ కోరుతుండటంతో అనుబంధ బ్యాంకుల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మమతా బెనర్జి వల్లనే షమీని అరెస్ట్ చేయడంలేదు

మమతా బెనర్జి వల్లనే షమీని అరెస్ట్ చేయడంలేదు

పశ్చిమబెంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే భారత క్రికెటర్‌ మహమ్మద్‌ షమిని పోలీసులు అరెస్టు చేయడంలేదని ఆరోపించింది షమి భార్య హసీన్‌ జహాన్‌. పోలీసులు నాకు రక్షణ కల్పిస్తున్నారు కానీ మద్దతు ఇవ్వడం లేదు. వారంతా షమికే మద్దతుగా నిలిచారు' అని అన్నారు. అనంతరం బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి పిచ్చివాడి నుంచా మీరు ఆశిస్తోంది?' అని ప్రశ్నించింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more