బంగాళాఖాతంలో అల్పపీడనం: రెండ్రోజుల్లో తమిళనాడులో వర్షాలు, ఏపీకి ఎఫెక్ట్ ఉండేనా?
వర్షాకాలం ముగిసినప్పటికీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హిందూ మహా సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం ఇందుకు కారణం. అల్పపీడనంకు అనుబంధంగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడుతుందని.. ఇది క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ జనవరి 31వ తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.