Technology Short News

అమెజాన్ ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌ విడుదల

అమెజాన్ ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌ విడుదల

అమెజాన్ నూతన ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌ను తాజాగా విడుదల చేసింది. ఇంటర్నెట్ ఫాస్ట్, లైట్ అండ్ ప్రైవేట్ పేరిట విడుదల ఈ ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని తమ తమ డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. అమెజాన్ ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్ ఇతర బ్రౌజర్ యాప్‌లలా కాకుండా చాలా తక్కువ సైజ్ మాత్రమే కలిగి ఉంటుంది.
త్వరలో ఫేస్‌బుక్‌ మెసెంజర్ లో పేమెంట్స్ ఫీచర్

త్వరలో ఫేస్‌బుక్‌ మెసెంజర్ లో పేమెంట్స్ ఫీచర్

ఫేస్‌బుక్‌ మెసెంజర్ యాప్‌లోనూ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్ అంతర్గతంగా పరిశీలిస్తుండగా, త్వరలో యూజర్ల కోసం ప్రవేశపెట్టనుంది. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో పేమెంట్స్ ఫీచర్ సహాయంతో యూజర్లు ఆ యాప్ నుంచి వేరే యాప్‌కు మారాల్సిన పనిలేకుండా నేరుగా అందులోనే పేమెంట్స్ చేయవచ్చు. ఒక యూజర్ మరో యూజర్‌కు నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లేదా మర్చంట్స్‌కు బిల్ పేమెంట్స్ చేయవచ్చు. మెసెంజర్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అమెరికా, యూకేలలో లభిస్తుండగా, అతి త్వరలో భారత్‌లోనూ యూజర్లకు అందుబాటులోకి రానుంది
వివో వి9 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

వివో వి9 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

వివో ప్రియులకు తీపి కబురు. వీవో వి9 యూత్‌ స్మార్ట్ ఫోన్ వచ్చేసింంది. పెరల్ బ్లాక్, షాంపేన్ గోల్డ్ రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ రూ.18,990 ధరకు వినియోగదారులకు ఈ నెల 24వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఐఫోన్ 10 తరహాలో ఈ ఫోన్‌కు డిస్‌ప్లే పై భాగంలో నాచ్‌ను ఏర్పాటు చేశారు. 4జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఇందులో అందిస్తున్నారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ పవర్‌ఫుల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఉచితంగా ‘వన్‌ప్లస్‌ 6’ గెలుచుకొవచ్చు

ఉచితంగా ‘వన్‌ప్లస్‌ 6’ గెలుచుకొవచ్చు

వన్‌ప్లస్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌. వన్ ప్లస్ తన లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఇందుకు అభ్యర్థులు తాము వాడుతున్న వస్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై నిష్పక్షపాతంగా, నిజాయితీగా రివ్యూ రాయాల్సి ఉంటుందని షరతులు విధించింది. కంపెనీ ప్రకటించిన ల్యాబ్‌ ప్రోగ్రాంలో ఉత్తమ ఫీడ్‌ బ్యాక్‌ లేదా రివ్యూ అందించిన యూజర్లకు ఉచితంగా వన్‌ప్లస్‌ 6ను అందిస్తామని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. ఈ పోటీలో ఎంపికయితే..ప్రపంచంలో వన్‌ప్లస్‌ 6ను అందుకునే తొలి వ్యక్తి మీరే అవుతారంటూ వెల్లడించింది.