Telangana Short News

హరీష్ తర్వాత మహేందర్ రెడ్డి: కొడంగల్‌లో రేవంత్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి

హరీష్ తర్వాత మహేందర్ రెడ్డి: కొడంగల్‌లో రేవంత్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి

కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆయన సొంత ఇలాకాలో చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రేవంత్ అనుచరులు పలువురు టీఆర్ఎస్‍‌లో చేరారు. కొడంగల్‌కు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి వస్తే.. అనే ఆలోచనతో మంత్రి హరీష్ రావు ముందుకు వెళ్తున్నారు. కొడంగల్‌పై హరీష్ ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి కూడా కొడంగల్‌పై దృష్టి సారించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిక్షలు వాయిదా!

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిక్షలు వాయిదా!

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్నీ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు వాయిదాపడ్డాయి. అన్నీ డిగ్రీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు ప్రకటించినప్పటికీ విద్యార్థుల జాబితా దోస్త్ వెబ్‌సైట్ నిర్వాహకుల నుంచి అందకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు చెప్పారు.

కాంగ్రెస్ లో చేరి రేవంత్ తప్పు చేశాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్ లో చేరి రేవంత్ తప్పు చేశాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రమని... అందులోకి వెళ్లిన రేవంత్ ను ఆ పార్టీ నేతలు ఎదగనిస్తారా? అనే అనుమానాన్ని తలసాని వ్యక్తం చేశారు. అదే టీడీపీలో అయితే రేవంత్ కు ఒక పదవి ఉండేదని, ఒక ఆఫీస్, ఒక ఛాంబర్ ఉండేవని... రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా పర్యటించి, తన గళం వినిపించే స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ జిల్లాల్లో పర్యటించగలరా? అని అన్నారు. కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఇతర నేతలు తమ ఇలాఖాలోకి రావడాన్ని ఇష్టపడరని...

లాకప్‌లో పెట్టి నాచేత ఆస్తులు రాయించుకోవాలనే: నాగసుశీలపై చింతలపూడి సంచలనం

లాకప్‌లో పెట్టి నాచేత ఆస్తులు రాయించుకోవాలనే: నాగసుశీలపై చింతలపూడి సంచలనం

ప్రముఖ సినీ నటుడు నాగార్జున సోదరి నాగ సుశీల తనపై ఫిర్యాదు చేయడంపై శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ స్పందించారు. లాకప్‌లో పెట్టయినా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పుడు లావాదేవీలకుపాల్పడలేదని చింతలపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తనకు రావాల్సిన డబ్బునే తీసుకున్నానని చెప్పారు. తనపై తప్పుగా ఫిర్యాదు చేశారని అన్నారు. 2005-06లోనే భూములను రిజిస్టర్ చేయించామని చెప్పారు. ఆ డబ్బులున్నీ కంపెనీనే ఖర్చు చేసిందని,