Business Short News

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ ప్రారంభం

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ ప్రారంభం

అమెజాన్ ఇండియా తన గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ సేల్ ఉంటుంది. అయితే ఎప్పటిలాగే ప్రైమ్ మెంబర్స్‌కు 12 గంటలు ముందుగానే అంటే ఇవాళ(జనవరి 20) మధ్యాహ్నం 12గంటల నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ కేటగిరీల్లో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10శాతం అదనపు డిస్కౌంట్ ఉంటుంది.
తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, ఆభరణాల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోవ‌డంతో బంగారం ధ‌ర త‌గ్గింది. బులియ‌న్ మార్కెట్లో నిన్న‌ బంగారం ధర రూ.150 తగ్గగా, ఇవాళ మ‌రో రూ.120లు తగ్గి 10గ్రాముల పసిడి ధర రూ.30,830గా న‌మోదైంది. మ‌రోవైపు వెండి ధ‌ర మాత్రం రూ.50 పెరిగి కిలో వెండి రూ.39,850గా న‌మోదైంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గిపోయాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శుక్రవారం దేశీయ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల్లో ముగిసాయి. ఉదయం నుండి లాభాలతో ఉన్న మార్కెట్లు చివరకు లాభాలతోనే ముగించాయి. చివరకు సెన్సెక్స్ 229.65 పాయింట్ల లాభంతో 35,489.94 వద్ద నిఫ్టీ 77.70 పాయింట్లు లాభపడి 10,894.70 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.63.76 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్‌, ఐటీ సెక్టార్‌ లాభాలు మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చాయి.
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 95పాయింట్ల లాభంతో 35,300 వద్ద, నిప్టీ 22 పాయిం‍ట్ల లాభపడి 10,800 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో స్థిరంగా కొనసాగుతున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాల ప్రభావం ఉంటుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. బ్యాంకింగ్‌, ఐటీ సెక్టార్‌ లాభాలు పండిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌, ఐడియా, ఆర్‌కాం, తదితర టెలికాం షేర్లు బలహీనంగా ఉన్నాయి.