Lifestyle Short News

మహా శివరాత్రి 2021 : మీ విషెస్ తో భోళా శంకరుడి ఆశీర్వాదాలు..

మహా శివరాత్రి 2021 : మీ విషెస్ తో భోళా శంకరుడి ఆశీర్వాదాలు..

హిందువులందరూ మహా శివరాత్రి పండుగను శివుని గౌరవార్థం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి ఏడాది మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుని శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. ఆ రోజునే శివుడు లింగ ఆకారంలో ఆవిర్భావించాడని శివ పురాణం చెబుతుందని పండితులు చెబుతుంటారు. హిందువులందరికీ ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఈ మహా శివరాత్రి నాడు చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో శివునికి పూజలు, ప్రార్థనలు చేస్తారు. ఈరోజు రాత్రంతా జాగరణ కూడా చేస్తారు...

శివుని అనుగ్రహం కోసం మీ బంధుమిత్రులకు ఇలా విషెస్ చెప్పేయండి

శివుని అనుగ్రహం కోసం మీ బంధుమిత్రులకు ఇలా విషెస్ చెప్పేయండి

శివ పురాణం ప్రకారం, ఆ లోకనాథుడు ఈరోజే లింగ ఆకారంలో ఉద్భవించడాని కూడా చెబుతారు. సర్వేశ్వరుడిగా.. విశ్వేశ్వరుడిగా.. అర్థనాథీశ్వరుడిగా కీర్తించబడే పరమాత్మయే ఈశ్వరుడు. కరోనా వంటి కష్టకాలంలో మహా శివరాత్రిని పండుగను పురస్కరించుకుని మీ స్నేహితులు, బంధువులు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని.. వారి జీవితం సుఖ సంతోషాలతో నిండాలని.. ఎల్లప్పుడూ అందరికీ మేలు కలగాలని.. ఇందుకు ఆ ఈశ్వరుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ మెసెజెస్, కోట్స్, ఇమెజెస్.