Andhra Pradesh Short News

పవన్ కల్యాణ్‌ పోరాటానికి ముద్రగడ మద్దతు

పవన్ కల్యాణ్‌ పోరాటానికి ముద్రగడ మద్దతు

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పోరాటానికి మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మద్దతు తెలిపారు. ఈ మేరకు పవన్‌కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు. 'మీ తల్లికి జరిగిన అవమానం తట్టుకోలేక దీక్షకు దిగారని తెలిసింది. మీ తల్లికి జరిగిన అవమానం నాకు బాధ కలిగించింది. అవమానం గురించి కేసు పెట్టి కోర్టుకు వెళ్లాలనే ప్రయత్నం మాత్రం చేయవద్దు. ఒక మెట్టు దిగి అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లాలని, ఇతర పార్టీల సహకారంతో చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పాలని సూచించారు.
బాలకృష్ణ నివాసం వద్ద హైటెన్షన్: ఇంటిముట్టడికి యత్నించిన

బాలకృష్ణ నివాసం వద్ద హైటెన్షన్: ఇంటిముట్టడికి యత్నించిన

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిని ముట్టడించడానికి బీజేవైఎం కార్యర్తలు ప్రయత్నించారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బాలకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్న కార్యకర్తలు.. ఆయన నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. బీజేవైం కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడిస్తారన్న సంగతి తెలుసుకుని.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్‌ చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కోపం వద్దు: అభిమానులకు దండం పెట్టిన పవన్

కోపం వద్దు: అభిమానులకు దండం పెట్టిన పవన్

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చారని తెలిసి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. దీంతో వారిని కలిసేందుకు పవన్ సమావేశం నుంచి బయటికి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారితో కాసేపు మాట్లాడి, కీలక సూచనలు చేశారు. జర్నలిస్టులను ఏమీ అనవద్దని అన్నారు. అభిమానులు ఎవ్వరూ కూడా కోపం తెచ్చుకోకూడదని అన్నారు. వాళ్లు తెలివిగా కుట్రలు చేస్తున్నారని అభిమానులకు చెప్పారు. తాను చెప్పే వరకూ శాంతంగా ఉండాలని పవన్ అభిమానులకు సూచించారు.

ఆ రెండు ఛానెళ్లపై తీవ్రంగా స్పందించిన పవన్

ఆ రెండు ఛానెళ్లపై తీవ్రంగా స్పందించిన పవన్

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఓ ప్రముఖ మీడియా సంస్థ(టీవీ9) యజమాని శ్రీనిరాజు నోటీసులు పంపారు. తనను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు. కాగా, శ్రీని నోటీసులను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 'నా తల్లిని మళ్లీ మళ్లీ అసభ్య పదజాలం వినిపిస్తూ అవమానించిన మీ టీవీ9ఛానల్ సీఈఓ రియల్ అజ్ఞాతవాసిరవిప్రకాశ్, మీకు శ్రీసిటీ బ్లెస్ చేసిన మీ రాజకీయ పెద్దలపై నా అభిప్రాయం మారదు. గుడ్‌లక్ శ్రీని' అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.