వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని సరిహద్దులో రైతు సంఘాల నేతలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అధిక భాగం రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. ఆందోళనలు చేస్తున్న రైతులతో జనవరి 19న మరో విడత చర్చలు నిర్వహించనున్నామని ఆయన ఆదివారం నిర్వహించిన ఓ సమావేశంలో వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు చాలా మంది రైతులు, నిపుణులు అనుకూలంగా ఉన్నారని తెలిపారు.