Movie Short News

Pushpa: అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన రికార్డు.. ఈ సారి తెలుగులో కాదు తమిళంలో!

Pushpa: అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన రికార్డు.. ఈ సారి తెలుగులో కాదు తమిళంలో!

బడా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లో చాలా కాలంగా బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండేళ్ల క్రితం వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న ఈ స్టార్ హీరో.. ఆ వెంటనే పాన్ ఇండియాపై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను చేశాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా..

బోయపాటి లిస్టులో మరో యువ హీరో.. అఖండ సీక్వెల్ కంటే ముందే పవర్ఫుల్ స్టోరీ?

బోయపాటి లిస్టులో మరో యువ హీరో.. అఖండ సీక్వెల్ కంటే ముందే పవర్ఫుల్ స్టోరీ?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందకున్న బోయపాటి శ్రీను తదుపరి సినిమాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి అఖండ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన బోయపాటి ఆ తర్వాత అదే కథకు సీక్వెల్ కూడా తెరపైకి తీసుకురావాలని చూస్తున్నాడు. అయితే దాని కంటే ముందుగానే ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆ యువ హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

Pawan Kalyan: ఆ సమయానికి భీమ్లా నాయక్ వస్తే.. ఓటీటీ డేట్ కూడా ఫిక్స్!

Pawan Kalyan: ఆ సమయానికి భీమ్లా నాయక్ వస్తే.. ఓటీటీ డేట్ కూడా ఫిక్స్!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరోనా కారణంగా పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా కూడా లేకుండా వాయిదా వరుసగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సినిమా కూడా గత ఏడాది నుంచి వాయిదా పడుతూనే ఉంది. అసలైతే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకోక తప్పలేదు. ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

Bangarraju 15 Days Collections: శుక్రవారం దారుణంగా కలెక్షన్లు.. 15 రోజుల్లో తొలిసారి ఇంత తక్కువగా!

Bangarraju 15 Days Collections: శుక్రవారం దారుణంగా కలెక్షన్లు.. 15 రోజుల్లో తొలిసారి ఇంత తక్కువగా!

చాలా కాలంగా సరైన బ్రేక్ లేక సతమతం అవుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ విజయం మాత్రం ఆయన దరి చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న తన కుమారుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి 'బంగార్రాజు' అనే సినిమాను చేశాడు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.