Sports Short News

బౌలింగ్ సీక్రెట్ చెప్పేసిన భువనేశ్వర్‌

బౌలింగ్ సీక్రెట్ చెప్పేసిన భువనేశ్వర్‌

తన ప్రదర్శనలో క్రమేపీ మెరుగుదల కనిపించడానికి ముఖ్య కారణం అనుభవంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమేనని టీమిండియా బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ స్పష్టం చేశాడు. నేను బౌలర్‌గా మెరుగు కావడానికి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఒకటైతే, రెండోది అనుభవం. నా బౌలింగ్‌లో వైవిధ్య కనిపించడానికి అనుభవం బాగా ఉపయోగపడింది. దాదాపు రెండు మూడేళ్ల నుంచి పలు విషయాల్ని నేర్చుకుంటూ ముందుకు సాగతున్నా. నేను బౌలర్‌గా సక్సెస్‌ కావడానికి చాలా శ్రమించా. ప్రస్తుతం నేను ఒక కీలక బౌలర్‌గా ఉన్నానంటే అది అంత ఈజీగా వచ్చింది కాదన్నాడు.
విండీస్ ఆటగాళ్లకు టెస్ట్‌ క్రికెట్‌లంటే బోరుకొట్టిందట

విండీస్ ఆటగాళ్లకు టెస్ట్‌ క్రికెట్‌లంటే బోరుకొట్టిందట

కేవలం ఐపీఎల్‌ కాదు ప్రపంచంలోని ఏ టీ20 లీగ్‌ చూసినా విండీస్‌ క్రికెటర్ల సందడి కనిపిస్తుంది. టీ20ల కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడానికి కారణం టెస్ట్‌ క్రికెట్‌పై వాళ్లకు బోర్‌ కొట్టడమేనట. ఈ విషయాన్ని ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా చేస్తున్న జింబాబ్వే మాజీ కెప్టెన్‌ హీత్‌ స్ట్రీక్‌ చెప్పాడు.‘వాళ్లు తొలుత ఎంజాయ్‌మెంట్‌ కోసం టీ20లను ఎంచుకున్నారు. తర్వాత తర్వాత ఆ ఆటగాళ్లకు టెస్ట్‌ క్రికెట్‌ బోర్‌ కొట్టింది. అందుకే ప్రపంచంలోని వివిధ టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నారు' అని అతడు తెలిపాడు.
సచిన్‌ కు విరాట్‌ కోహ్లి కృతజ్ఞతలు

సచిన్‌ కు విరాట్‌ కోహ్లి కృతజ్ఞతలు

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు విరాట్‌ కోహ్లి కృతజ్ఞతలు తెలిపాడు.  టైమ్స్‌ మేగజైన్‌ విడుదల చేసే ‘100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా'లో కోహ్లి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో​ చోటు దక్కించుకున్న వారి ప్రొఫైల్స్‌ను ఆయా రంగాల్లోని ప్రముఖులు రాస్తుంటారు. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి ప్రొఫైల్‌ను మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రాశారు. పరుగుల సాధించాలన్న కసి, ఆటలో నిలకడ ప్రదర్శించడం విరాట్‌ గొప్పదనమని పేర్కొన్నాడు. భారత్‌కు ఎన్నో పేరు ప్రఖ్యాతుల్ని అందించాలి. గో విరాట్‌..! అంటూ ప్రొఫైల్‌కు ముగింపునిచ్చాడు సచిన్‌.
2019 వన్డే వరల్డ్‌ కప్‌లో కోహ్లీ సేనే ఫేవరేట్‌

2019 వన్డే వరల్డ్‌ కప్‌లో కోహ్లీ సేనే ఫేవరేట్‌

2019 ఐసీసీ వరల్డ్‌ కప్‌లో కోహ్లీ సేన ఫేవరేట్‌గా బరిలోకి దిగనుందని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. కోల్‌కతాలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ 'ఇంగ్లాండ్‌లో జరుగనున్న ప్రపంచకప్‌ను భారత జట్టే గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసాడు. ప్రస్తుత జట్టు విదేశీ గడ్డపై ఎక్కడైనా మెరుగైన ప్రదర్శన చేయగల సత్తా ఉందని నిరూపించుకుందన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా మంచి బంతులు వేయగల బౌలింగ్‌ లైనప్‌ ఉందన్నాడు.