UK-India Week 2022 : లండన్ లో అట్టహాసంగా ప్రారంభం- సృజనాత్మక పరిశ్రమలపై ఫోకస్
యూకే కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) నిర్వహించే వార్షిక UK-ఇండియా వీక్ 2022 లండన్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజు భారత్-బ్రిటన్ మధ్య 75 ఏళ్ల సంబంధాలకు ప్రతీకగా ఈ ఏడాది రీఇమేజిన్@75 థీమ్‌ను ప్రతిబింబించే సృజనాత్మక సెషన్‌తో ఈ వీక్ ప్రారంభమైంది.
భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యూకే-ఇండియా వీక్ 2022లో తొలిరోజు.. సృజనాత్మక పరిశ్రమలు-సాంస్కృతిక ఆర్ధిక వ్యవస్ధపై ఇరుదేశాల ప్రతినిధుల మధ్య విస్తత చర్చలు జరిగాయి.