కోటి రూపాయల కారు కొన్న టీవీ నటి!
బుల్లితెర తారలు తమ జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా వాటిని సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా, ఓ బుల్లితెర నటి సుమారు కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసి, ఆ కారును డెలివరీ తీసుకుంటున్న వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి, వైరల్ అయ్యింది.
బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ టెలివిజన్ స్టార్ నియా శర్మ, సరికొత్త వోల్వో ఎక్స్సి90 డి5 ఇన్స్క్రిప్షన్ కారును కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన అభిమానులతో పంచుకుంది.