సవాల్ బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?
2009లో 294 నియోజకవర్గాల్లో 104 సీట్ల వరకు బీసీలకు ఇచ్చారు చిరంజీవి. ఆ లెక్కన ఇప్పుడు 175 ఏపీ అసెంబ్లీ సీట్లలో దాదాపు 75 సీట్లకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పదేపదే బీసీల పాట పాడుతున్న అధికార, విపక్షాలు జనసైనికుల సవాల్ను స్వీకరిస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు చిరంజీవి దారిలో ఏ మేరకు నడుస్తారనే చర్చ సాగుతోంది. అయితే, జనసేన ఇప్పుడే ఎన్నికల బరిలోకి దిగుతుండటం, చాలామంది కొత్త వారికి అవకాశమివ్వాలని చూస్తున్న నేపథ్యంలో.. ఇది తమకు వర్తిస్తుందని భావిస్తుందా లేదా తెలియాల్సి ఉంది.