భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణానికి మేలు వంటి కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే దేశంలో EV మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలో మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా టాటా టియాగో (Tata Tiago EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), ఎంజీ విండ్సర్ (MG Windsor EV) వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. ఈ కార్లు మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో.
గుడ్డు సొనలు కొలెస్ట్రాల్‌ను ఎలా ప్రభావితం చేస్తాయి, ఆహారం మరియు ఆరోగ్యం ద్వారా గుండె ప్రమాదం ఎలా మారుతుందో మరియు సురక్షితమైన, సమతుల్య గుడ్డు వినియోగం కోసం ఆచరణాత్మక చిట్కాల అవలోకనం.
నెల జీతం సరిపోతుంది.. చిన్న బడ్జెట్లో స్టైలిష్ కారు
SUVలు మార్కెట్లో ట్రెండ్‌గా మారకముందు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో వినియోగదారుల మనసును గెలుచుకున్న కార్లలో హ్యూందాయ్ ఐ20 (Hyundai i20) ఒకటి. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒకప్పుడు కలల కారుగా భావించబడేది. ఆకర్షణీయమైన డిజైన్, మంచి పనితీరు, ఆధునిక ఫీచర్లు వంటి అంశాలతో ఈ కారు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ముఖ్యంగా రెండవ తరం 'ఎలైట్ i20' యూరోపియన్ కార్లను తలపించే స్టైలిష్ డిజైన్‌తో వచ్చినప్పుడు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది. కాలం మారడంతో SUVల ప్రాచుర్యం పెరిగినా కూడా హ్యూందాయ్ ఐ20 తన ప్రత్యేక స్థానాన్ని కోల్పోలేదు.