Short News

కాలువలో గల్లంతైన ఎస్‌ఐ వంశీధర్‌ మృతి

కాలువలో గల్లంతైన ఎస్‌ఐ వంశీధర్‌ మృతి

విజయవాడ-అవనిగడ్డ మార్గంలోని కరకట్టపై ఘంటసాల మండలం పాపవిశానం వద్ద పంటకాలువలో కొట్టుకుపోయిన ఎస్‌ఐ చనిపోయాడు. చల్లపల్లి మండలం మంగళాపురం వద్ద ఎస్‌ఐ మృతదేహం లభ్యమైంది. సుమారు 20 కిలో మీటర్ల దూరం ఎస్‌ఐ మృతదేహం కొట్టుకుపోయింది. కాలువలో నుంచి వెలికి తీసిన అనంతరం పోస్టుమార్టం చేయడానికి ఎస్‌ఐ వంశీధర్‌ మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వానికి తరలించారు. వంశీధర్‌ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్‌ఐగా పనిచేస్తున్న సంగతి తెల్సిందే.
తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

టాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలతో శ్రీరెడ్డి సెలేబ్రిటిగా మారిపోయింది. ఆమె ఆరోపణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమిళ, తెలుగు సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజగా శ్రీరెడ్డి టాలీవుడ్ నిర్మాత రాంకీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడితో జరిగిన చాటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.రాంకీ మొదటి నుంచి శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పలు టివి డిబేట్లలో రాంకీ పాల్గొన్న సంగతి తెలిసిందే.

నేరుగా మార్కెట్లోకి 'అరవింద సమేత' పాటలు

నేరుగా మార్కెట్లోకి 'అరవింద సమేత' పాటలు

ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయిక. గురువారం నేరుగా ఈ చిత్ర పాటల్ని విడుదల చేస్తున్నారు. దీంతో అభిమానుల్లో సందడి మొదలైంది. అక్టోబరు 1,లేదా 2న ముందస్తు వేడుకని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది.  సునీల్, ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆంజనేయ స్వామి మహాత్యం: హుంకార మంత్రం మహిమ

ఆంజనేయ స్వామి మహాత్యం: హుంకార మంత్రం మహిమ


పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి ఇలా స్తుతించారు .
"నమస్తే రుద్ర మన్యవుతోతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉతతే నమః -యాత్ర్హ ఇషుశ్శివ తమా శివం బభువతే -శివా శరణ్యయా తవ తయానో రుద్ర మ్రుడయా -యాతే రుద్ర శివా తనూ రాఘోరా పాప కాశినీ -నమస్తే అస్తు భగవాన్ ,విశ్వేశ్వ రాయ ,మహాదేవాయ త్ర్యంబకాయ ,త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ ,కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీ మన్మహా దేవాయ నమః - తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ -తన్నో రుద్ర: ప్రచోదయాత్"

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more