Short News

కస్టమర్లు రాక దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

కస్టమర్లు రాక దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో చిన్న కార్ల విభాగంలో ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకటి. సరసమైన ధర, మంచి మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం వంటి కారణాల వల్ల ఈ కారు సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాలకు నచ్చిన ఎంపికగా నిలిచింది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది చాలా మందికి ప్రాధాన్యమైన కారుగా మారింది. అయితే, ఇటీవల కాలంలో ఈ కారుకు ఉన్న డిమాండ్ మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, 2026 ఫిబ్రవరి నెలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించింది. ఆ నెలలో మొత్తం కేవలం 862 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.
కార్ల ప్రపంచంలో మహా విప్లవం

కార్ల ప్రపంచంలో మహా విప్లవం

సినిమా హాల్‌లో కొత్త సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తామో, కార్ల మార్కెట్‌లో కూడా కొత్త మోడళ్ల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు జనం. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియాలో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న డిమాండ్ చూసి, ప్రముఖ కంపెనీలు రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) గట్టి ప్లాన్ వేశాయి. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా, రాబోయే మూడేళ్లలో ఏకంగా 5 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతున్నాయి. 2028 నాటికి ఈ కార్లన్నీ రోడ్ల మీద రయ్‌రయ్‌మంటూ తిరగనున్నాయి. ఈ లేటెస్ట్ ఎస్‌యూవీల ప్రత్యేకతలు ఏంటి? అవి ఎప్పుడు వస్తాయి? లాంటి వివరాలు తెలుసుకుందాం.
కస్టమర్లు రాక దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

కస్టమర్లు రాక దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో చిన్న కార్ల విభాగంలో ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకటి. సరసమైన ధర, మంచి మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం వంటి కారణాల వల్ల ఈ కారు సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాలకు నచ్చిన ఎంపికగా నిలిచింది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది చాలా మందికి ప్రాధాన్యమైన కారుగా మారింది. అయితే, ఇటీవల కాలంలో ఈ కారుకు ఉన్న డిమాండ్ మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, 2026 ఫిబ్రవరి నెలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించింది. ఆ నెలలో మొత్తం కేవలం 862 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.
కార్ల ఉత్పత్తిని సగానికి తగ్గించిన టాటా

కార్ల ఉత్పత్తిని సగానికి తగ్గించిన టాటా

మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగాన్ని, ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ పై జరిపిన దాడులు, ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతోంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం యుద్ధ భూమికే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు, గ్యాస్ సరఫరాను అస్తవ్యస్తం చేశాయి. దీనివల్ల టాటా మోటార్స్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.