చుక్క పెట్రోల్ అవసరం లేదు.. సింగిల్ ఛార్జ్‌తో 160 కిమీ రేంజ్
ఆటోమొబైల్స్
- 1 hr, 24 min ago
భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ (EV) మార్కెట్లోకి సరికొత్త ప్లేయర్ సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి రికార్డులు తిరగరాస్తోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ మొబిలిటీ (River Mobility) మార్కెట్లో ఉన్న దిగ్గజ బ్రాండ్లు టీవీఎస్ (TVS), బజాజ్ (Bajaj), ఓలా (Ola) వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది. ఈ కంపెనీ మార్కెట్లో కేవలం ఒకే ఒక్క మోడల్ రివర్ ఇండి (River Indie) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అమ్ముతోంది. అయినప్పటికీ, దీని సేల్స్ గ్రాఫ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఈ స్కూటర్ ఏకంగా 43,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాల మార్కును దాటేసింది. జూన్ 2026 నెలలో ఈ కంపెనీ 4,436 యూనిట్ల సేల్స్‌తో తన చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. దేశంలోని మొత్తం 175 ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీలలో రివర్ మొబిలిటీ అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి (Q1 2026) త్రైమాసికంలో 8వ స్థానంలో ఉన్న ఈ స్టార్టప్.. ఏప్రిల్, మే, జూన్ (Q2 2026) నాటికి ఏడో స్థానానికి ఎగబాకింది.