Short News

హీరో కిస్సులు పెట్టడంపై హెబ్బా పటేల్ సంచలనం, డబ్బులిస్తే....

హీరో కిస్సులు పెట్టడంపై హెబ్బా పటేల్ సంచలనం, డబ్బులిస్తే....

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ '24 కిస్సెస్'. మిణుగురులు' ఫేం అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలను ఫోకస్ చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై యువతలో ఆసక్తిని పెంచాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో చిత్ర బృందం మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అపోలోలో జయలలిత సీసీటీవీ ఫుటేజీ లేదు

అపోలోలో జయలలిత సీసీటీవీ ఫుటేజీ లేదు

దివంగత మాజీ సీఎం జయలలిత చెన్నైలోని అపోలో హాస్పటల్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే హాస్పటల్ సీసీటీవీ ఫూటేజ్ డిలీట్ అయ్యిందని అపోలో హాస్పటల్స్ జయ కేసును విచారిస్తున్న జస్టిస్ ఏ.అరుముగస్వామి కమిషన్‌కు తెలియజేసింది. జయ హాస్పటల్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ కావాలని ఆ కమిషన్ డిమాండ్ చేసింది. అయితే ప్రతి 30 రోజులకు ఒకసారి సీసీటీవీ దృశ్యాలు ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతాయని అపోలో అధికారి తెలిపారు. 2016, సెప్టెంబర్ 22 నుంచి 2016 డిసెంబర్ 5వ తేదీ వరకు జయలలిత అపోలో హాస్పటిల్‌లో ఉన్నారు.
సిటీ బ్యాంక్‌లో భారీ క్రెడిట్‌ కార్డుల మోసం

సిటీ బ్యాంక్‌లో భారీ క్రెడిట్‌ కార్డుల మోసం

ఢిల్లీలో భారీ క్రెడిట్‌ కార్డు మోసం వెలుగులోకి వచ్చింది. కన్నాట్‌ ప్లేస్‌లో ఉన్న సిటీ బ్యాంక్‌లో మోసగాళ్ళు సేవింగ్స్‌ ఖాతాలు తెరిచి క్రెడిట్‌ కార్డులు పొంది పూర్తిగా వాడేసుకుని బిల్లులు చెల్లించుకుండా పారిపోయారు. ఇలా బ్యాంక్‌కు రూ.2.4 కోట్ల క్రెడిట్‌ కార్డుల బకాయిలను చెల్లించలేదు. ఇలాంటివి మొత్తం 36 కేసులు నమోదయినట్లు బ్రాంచ్‌ తెలిపింది. తప్పుడు అడ్రస్‌లతో కస్టమర్లు క్రెడిట్‌ కార్డులు పొందారని, ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో వీరు ఈ కార్డులను స్వైప్‌ చేసినట్టు పేర్కొన్నారు. దీనిపై పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలు చేసారు. 
సూర్య గొప్ప మనసు: అభిమాని కోరిక తీర్చి... ఖర్చు భరిస్తానని హామీ!

సూర్య గొప్ప మనసు: అభిమాని కోరిక తీర్చి... ఖర్చు భరిస్తానని హామీ!

సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం నటన మాత్రమే కాదు, సేవా గుణం, అభిమానుల పట్ల చూపించే ప్రేమ... ఆయన్ను ఇంత గొప్పస్థాయికి తీసుకొచ్చిందని చెబుతుంటారు. తాజాగా మరోసారి సూర్య తన పెద్ద మనసు చాటుకున్నారు. జబ్బుతో బాధ పడుతున్న కెవి దినేష్ అనే బాలుడు తన అభిమాన హీరోను కలవాలని ఆశపడటంతో ఈ విషయం ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా తెలుసుకున్న సూర్య అతడిని తన ఇంటికి పిలిపించుకుని కలిశారు. ఈ సందర్భంగా దినేష్‌కు సూర్య పలు కానుకలు అందించారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more