Short News

చిరంజీవితో అనుష్క.. 12 ఏళ్ల తర్వాత మరో మ్యాజిక్‌కు రెఢీ!

చిరంజీవితో అనుష్క.. 12 ఏళ్ల తర్వాత మరో మ్యాజిక్‌కు రెఢీ!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫ్యాన్స్ అలరించేందుకు రెడీ అవుతున్నాడు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తూనే మరో సినిమాపై దృష్టిపెట్టారు. సైరా తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్వకత్వంలో ఓ సినిమా చేయడానికి చిరంజీవి ఒకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ పేరుపై అనేక ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి. కొరటాల శివ కెరీర్ గ్రాఫ్‌ను పక్కాగా డిజైన్ చేసుకొంటున్నారడంలో ఎలాంటి సందేహం లేదు.

షూటింగ్ లో గాయపడిన అమలాపాల్

షూటింగ్ లో గాయపడిన అమలాపాల్

మలయాళ భామ అమలాపాల్ యాక్షన్ సీక్వెన్స్ లో గాయపడింది. అధో అంధ పరవై పోలా చిత్ర షూటింగ్ లో ఓ స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో గాయమైంది. చేయి మడతపడడం వలన లిగ్మెంట్ టేర్ తో  అమలాపాల్ బాధపడింది. చేతితో  సంబంధం లేకుండా  ఉండే కొన్ని సన్నివేశాలని అమలాపాల్ పూర్తి చేసిందని చెబుతున్నారు.  ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకుంటున్న అమలా కొన్నాళ్ళు షూటింగ్ కి దూరంగా ఉండనుంది.
మా గురించి ఎవరేమన్నా పట్టించుకోను

మా గురించి ఎవరేమన్నా పట్టించుకోను

దక్షిణాది హీరోయిన్ నయనతార ఇప్పుడు దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తోందని సమాచారం. నయన్ తన ప్రియుడు విఘ్నేశ్‌శివకు అత్యంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఒక టీవీ భేటీలో పాల్గొంది. ఈ సందర్భంగా తన ప్రేమ గురించి చెబుతూ.. ఈ ప్రపంచం మిమ్మల్ని చూసే విధం రోజుకో విధంగా మారిపోతూనే ఉంటుంది. కొందరికి ఈ రోజు నచ్చుతారు. రేపు వారికి నచ్చకపోవచ్చు. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం జీవితాన్ని అనుభవించలేం అని పేర్కొంది.
మరొకరిని దత్తత తీసుకోవాలని అనుకుంటే..

మరొకరిని దత్తత తీసుకోవాలని అనుకుంటే..

హాలీవుడ్‌ నటి ఏంజిలినా జోలీ మరో చిన్నారిని దత్తత తీసుకోవాలని ఏంజిలినా భావిస్తున్నారట. కానీ ఇది బ్రాడ్‌‌‌కు ఇష్టం లేదని హాలీవుడ్‌ వర్గాల సమాచారం. 'మరో చిన్నారిని దత్తత తీసుకోవడం బ్రాడ్‌కు ఇష్టం లేదు. ఆయనకు తన పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పుడు కుటుంబంలో ఉన్న వారు చాలని ఆయన అభిప్రాయం' అని బ్రాడ్‌ సన్నిహితులు అన్నట్లు తెలిపింది. బ్రాడ్ నుండి విడిపోయిన ఏంజిలీనా ప్రస్తుతం పిల్లల సంరక్షణను ఏంజిలినా చూసుకుంటున్నారు. ఇటీవల పిల్లల పోషణకు బ్రాడ్‌ కావాల్సినంత నగదు ఇవ్వలేదని జోలీ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more