Short News

4 కోట్ల‌కు పైగా వ్యూస్‌తో గీత గోవిందం పాట రికార్డు

4 కోట్ల‌కు పైగా వ్యూస్‌తో గీత గోవిందం పాట రికార్డు

విజయ్ దేవరకొండ, రష్మిక న‌టించిన ‘గీతగోవిందం' లోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె' పాట యూ ట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే కోటికి పైగా వ్యూస్ రాబట్టిన ఈ పాట తాజాగా 4 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. దక్షిణాదిలో అత్యంత వేగంగా యూ ట్యూబ్‌లో 4 కోట్ల వ్యూస్ రాబట్టిన పాటగా రికార్డు నెలకొల్పిందీ సాంగ్. మరోవైపు ఈ పాటకు 4,50,000 లైకులు కూడా రావటం విశేషం. పాటలోని లిరిక్స్ బాగా ఆకట్టుకుంటూ యువతను పదే పదే వినేలా చేస్తున్నాయి.   
శుభవార్త: 5 రైళ్లలో ఏసీ కోచ్ టిక్కెట్ల ధరలు భారీగా తగ్గింపు

శుభవార్త: 5 రైళ్లలో ఏసీ కోచ్ టిక్కెట్ల ధరలు భారీగా తగ్గింపు

ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకులకు శుభవార్త తెలిపింది. అయిదు సౌత్ వెస్టర్న్ రైళ్లలోని ఏసీ కోచ్‌లు లేదా చెయిర్ కార్స్‌లలో టిక్కెట్ ధరలు తగ్గించింది. ఏసీ బోగీలు అంటే ఖరీదైన ప్రయాణం. సామాన్యులకు అందని విధంగా ఉంటుంది. అయితే ఇండియన్ రైల్వేస్ ఏసీ బోగీల టిక్కెట్ ధరలను తగ్గించింది. అందరికీ ప్రయాణం సులువుగా ఉండేందుకు ఇలా తగ్గించింది. సౌత్ వెస్ట్ జోన్‌లోని అయిదు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ బోగీలకు టిక్కెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అయిదు రైళ్లను కర్ణాటకలోని బెంగళూరు, గదగ్, మైసూరు ప్రాంతాల నుంచి నిర్వహిస్తున్నారు.

‘గీత గోవిందం’ ముద్దు సీన్ల ఎఫెక్ట్... థియేటర్లపై దండయాత్రే!

‘గీత గోవిందం’ ముద్దు సీన్ల ఎఫెక్ట్... థియేటర్లపై దండయాత్రే!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన 'గీత గోవిందం' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత మూడు రోజులుగా తెలుగు మీడియాలో, ఇండస్ట్రీలో సర్కిల్‌లో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ఇలా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే సాగుతోంది. అందుకు కారణం 'గీత గోవిందం' సీన్లు ముందే లీక్ అవ్వడం, ఈ చర్యకు బాధ్యులైన కొందరు వ్యక్తులను, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోవడమే. కారణాలేమైనా 'గీత గోవిందం'పై భారీ బజ్ ఏర్పడింది.

త‌మిళంలో అల‌రించ‌నున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

త‌మిళంలో అల‌రించ‌నున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. అన్నదమ్ముల అన్యోన్యత, కుటుంబ సెంటిమెంట్‌, భావోద్వేగాల కలయికలో వచ్చిన ఈ చిత్రం చెన్నైలోని ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. కాస్త ఆలస్యమైనప్పటికీ తమిళ సొబగులను అద్దుకుని కోలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించేందుకు ‘నెంజమెల్లా పలవన్నం'గా వస్తోంది. రోల్స్‌ ప్రైడ్‌ మీడియా బ్యానరుపై సెప్టెంబ‌రులో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఏఆర్‌కే రాజరాజా తమిళంలో మాటలు పాటలు రాశారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more