Short News

ఒక్క ఫోటోతో జీవితమే మారిపోయింది.. ఆటోలో వచ్చి చులకనగా, లెజెండ్ ఛాన్స్.. జగపతి బాబు!

ఒక్క ఫోటోతో జీవితమే మారిపోయింది.. ఆటోలో వచ్చి చులకనగా, లెజెండ్ ఛాన్స్.. జగపతి బాబు!

విలన్ పాత్రల్లో జగపతి బాబు ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఆయనకు ఇది సెకండ్ ఇన్నింగ్స్. కెరీర్ ఆరంభంలో కుటుంబకథా చిత్రాలతో అలరించిన జంగపతి బాబు ఇలా విలన్ గా మెప్పిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు విలన్ గా తన అవకాశాలు గురించి వివరించారు. చాలా కాలం పాటు అవకాశాలు లేక తన పరిస్థితి ఎలా మారిందో తెలిపారు. ఓ వ్యక్తి ఆటోలో వచ్చి తాను తెరకెక్కించబోయే సినిమాలో క్యారెక్టర్ రోల్ పోషించాలని అడిగాడు. డైరెక్టర్, నిర్మాత, హీరో అన్ని నేనే.. మరి నేను ఏంటి అని అడిగాను. క్యారెక్టర్ రోల్ అని చెప్పాడు.

‘దాసు’ కోసం బిగ్ బాస్ సీజన్ 2పైకి వచ్చిన ‘దేవ’

‘దాసు’ కోసం బిగ్ బాస్ సీజన్ 2పైకి వచ్చిన ‘దేవ’

బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకున్న వేళ నాగార్జున దేవ‌దాస్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ స్టేజ్‌పైకి వ‌చ్చారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. అయితే మా దాస్‌ని ఎవ‌రో ఇబ్బంది పెడుతున్నార‌ట‌. గ‌న్‌లో క‌రెక్ట్‌గా ఆరు బుల్లెట్స్ ఉన్నాయ‌ని నాగ్ చెబుతున్న డైలాగ్స్‌తో ఈ రోజు ప్ర‌సార‌మయ్యే షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. అంటే ఈ రోజు బిగ్ బాస్ స్టేజీపై నానితో పాటు నాగ్ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నార‌న్న‌మాట‌.
బిగ్ బాస్ తెలుగు: ఈ వారం ఎలిమేనేట్ అయ్యే వ్యక్తి ‘రోల్ రైడా’?

బిగ్ బాస్ తెలుగు: ఈ వారం ఎలిమేనేట్ అయ్యే వ్యక్తి ‘రోల్ రైడా’?

తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్ బాస్ సీజన్-2 ముగింపు దశకు చేరుకున్నది. అయితే ఈ వారంలో రోల్ రైడా ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. గుడ్లు జాగ్రత్త టాస్క్ లో రోల్ రైడా ఓడిపోవడంతో, ఫైనల్ వారానికి వెళ్లే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని, ఈ వారంలో దీప్తి నల్లమోతు, గీతా మాధురి కన్నా రోల్, సామ్రాట్ లకు తక్కువ ఓట్లు రావడం, ఇప్పటికే సామ్రాట్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించడంతో రోల్ వెళ్లిపోనున్నాడని తెలుస్తోంది. రోల్ వెళ్లిపోతే, బిగ్ బాస్ లో ఫైనల్ వీక్ లో తనీష్, గీత, దీప్తి, కౌశల్, సామ్రాట్‌ ల మధ్య పోటీ సాగుతుంది.
శాంతిచర్చలు: తిరస్కరించిన భారత్‌పై ఇమ్రాన్ అక్కసు

శాంతిచర్చలు: తిరస్కరించిన భారత్‌పై ఇమ్రాన్ అక్కసు

ఓ వైపు సరిహద్దుల్లో సైన్యాన్ని చంపుతూ, మరోవైపు చర్చలకు పాకిస్తాన్ పిలవడాన్ని భారత్ తిప్పికొట్టింది. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని చర్చలకు సిద్ధమని ప్రకటించగా, తొలుత భారత్ సిద్ధపడింది. కానీ ఆ తర్వాత చర్చలకు విముఖత చూపింది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. భారత్ పైన అక్కసు వెళ్లగక్కాడు. శాంతి కోసం చర్చలు జరపడానికి తాను ఇచ్చిన పిలుపునకు భారత్‌ దురహంకారంగా, ప్రతికూలంగా ఇచ్చిన సమాధానం నిరాశపరిచిందని, గొప్ప స్థానంలో కూర్చొని గొప్ప లక్ష్యాలు లేకుండా పని చేసేవారిని తన జీవితంలో చాలా మందిని చూశానని ఆయన ట్వీట్‌ చేశారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more