Short News

సైరా సెట్‌లో సంద‌డి చేసిన ప‌వ‌న్‌!

సైరా సెట్‌లో సంద‌డి చేసిన ప‌వ‌న్‌!

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి' సెట్‌లో ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా సెట్‌లో చిరు, అమితాబ్‌ బచ్చన్‌, రామ్‌చరణ్‌తో కలిసి పవన్‌ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే పవన్‌ తాజాగా సెట్‌కు వెళ్లారా, లేదా గతంలో జరిగిన షెడ్యూల్‌లో చిరును కలిశారా అనే విషయంపై స్పష్టత రాలేదు.సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ‌ పతాకంపై రామ్‌చరణ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో చిరు గురువు పాత్రలో అమితాబ్‌ కనిపించనున్నారు.   
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, హర్యానా రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. రాగల 36 గంటల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో కేదార్‌నాథ్‌, యమునోత్రి యాత్రికులకు ముందుస్తు హెచ్చరికలు జారీ చేసారు. ఈ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందారు. హిమచల్‌ ప్రదేశ్‌లోని బీయాస్‌ నది తీవ్ర ఉదృతంగా ప్రవహిస్తుడడంతో పలు జిల్లాల్లో హైఅలర్టు ప్రకటించారు.  
పాకిస్థాన్ ఆటగాళ్ళు ఆత్మవిశ్వాస లోపంతో ఉన్నారు

పాకిస్థాన్ ఆటగాళ్ళు ఆత్మవిశ్వాస లోపంతో ఉన్నారు

ఆసియా కప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ జట్టు రెండుసార్లు ఓడిపోవటంపై ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్‌ స్పందించాడు. 'ప్రస్తుతం మా ఆటగాళ్ళు ఆత్మవిశ్వాస లోపంతో బాధ పడుతున్నారు. విఫలమవుతామేమో అన్న భయం డ్రెస్సింగ్‌ రూంలో కనిపిస్తోంది. క్రికెట్‌ ఆత్మవిశ్వాసంతో ఆడాల్సిన ఆట. ఉదాహరణకు ఫకార్‌ జమాన్‌ను చూడండి. అతను కీలక ఆటగాడు. అత్యుత్తమ స్థాయిలో ఆడాల్సిన జమాన్‌ తన ఆటపై తనకే సందేహాలున్నట్లుగా ఆడాడు. తొమ్మిది వికెట్ల తేడాతో ఓడటం అంటే చెత్త ప్రదర్శనే. ఐతే మేం మెరుగవడానికి ప్రయత్నిస్తాం' అన్నాడు.
ప్రముఖ గాయని వాణి జయరామ్‌ పతీవియోగం

ప్రముఖ గాయని వాణి జయరామ్‌ పతీవియోగం

ప్రముఖ గాయని వాణి జయరామ్‌ భర్త జయరామ్‌ అనారోగ్యంతో కన్ను మూసారు. వేలూరు జిల్లాకు చెందిన వాణి జయరామ్‌ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో పాటు పలు భాషల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. కలైవాణి అనే తన పేరును జయరామ్‌ను పెళ్ళిచేసుకున్న తర్వాత వాణి జయరామ్‌గా మార్చుకున్నారు. వివాహం తర్వాత దంపతులు ముంబయిలో స్థిరపడ్డారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం తెలుగులో స్వాతికిరణం వంటి ఎన్నో చిత్రాల్లో పాటలు పాడారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more