ఇండియాలోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఈవీని దించుతున్న టాటా మోటార్స్
ఆటోమొబైల్స్
- 2 hr, 17 min ago
భారతదేశపు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) ఈవీ ప్రియుల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EV (Tata Sierra EV) ప్రొడక్షన్ మోడల్ లాంచ్ డేట్‌ను కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సరికొత్త ఆల్-న్యూ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జూన్ 30న భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఒకప్పుడు భారత రోడ్లపై సంచలనం సృష్టించిన ఐకానిక్ సియెర్రా కారును, ఇప్పుడు సరికొత్త మోడ్రన్ ఎలక్ట్రిక్ అవతారంలో టాటా సంస్థ రీ-లాంచ్ చేస్తుండటంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.