Short News

భాగ్యనగరానికి కన్నుకొట్టనున్న ప్రియా వారియ‌ర్

భాగ్యనగరానికి కన్నుకొట్టనున్న ప్రియా వారియ‌ర్

మలయాళ నటి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హైద‌రాబాద్‌ వస్తోంది. 16వ సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక‌లో పాల్గొనేందుకు ఆదివారం హైద‌రాబాద్‌కి రానుంది. 'బెస్ట్ ఫేస్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకునేందుకు ప్రియా వస్తున్న‌ట్టు సంతోషం అధినేత సురేష్ కొండేటి తెలిపారు. ఈ విషయమై ప్రియా వారియర్ అధికారికంగా మాట్లాడిన వీడియోను విడుదల చేసారు. ప‌లువురు సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నున్న ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు సమాచారం.
మణిరత్నం ‘నవాబ్’ ప్రీ రిలీజ్‌ రేపే

మణిరత్నం ‘నవాబ్’ ప్రీ రిలీజ్‌ రేపే

మణిరత్నం దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం నవాబ్‌. ఇటీవలె విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. అయితే నవాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 25న పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులందరూ హాజరుకాబోతున్నారని మేకర్స్‌ ప్రకటించారు.
బిగ్‌బాస్ 2లోనే చాలా విసుగు తెప్పించే వ్యక్తి కౌశల్

బిగ్‌బాస్ 2లోనే చాలా విసుగు తెప్పించే వ్యక్తి కౌశల్

బిగ్‌బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, సామ్రాట్, గీతా మాధురి ఫైనల్స్‌కు చేరిన వారిలో ఉన్నారు. ప్రేక్షకుల నుంచి ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వారే విజేత. అయితే హౌస్‌ నుంచి అతన్ని హౌస్ నుంచి బయటకు గెంటేయండి' అని ట్వీట్ పెట్టారు కత్తి మహేష్. బిగ్‌బాస్ చరిత్రలోనే చాలా చిరాకు తెప్పించే వ్యక్తి' అని ట్వీట్ చేశారు. అతను గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనేది ప్రూవ్ అవుతుంది' అని కత్తి మహేష్ పేర్కొన్నారు. తాను దీప్తి నల్లమోతు తరుఫున క్యాంపెయిన్ నిర్వహిస్తానని ఫేస్‌బుక్ ద్వారా మహేష్ తెలిపారు.
ఆ బయోపిక్ ఎందుకు చేయలేదంటే.. నాగార్జున వివరణ

ఆ బయోపిక్ ఎందుకు చేయలేదంటే.. నాగార్జున వివరణ

టాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతున్నది. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, పుల్లెల గోపిచంద్ బయోపిక్ లాంటివి తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో నా వద్దకు ఓ బయోపిక్ ఆఫర్ వచ్చిందని అక్కినేని నాగార్జున తెలిపారు. అయితే మా నాన్న అక్కినేని నాగేశ్వరరావుది కాదు అని స్పష్టం చేశారు. వీపీ మీనన్ (వప్పాల ఫంగున్ని మీనన్) జీవితం ఆధారంగా తెరకెక్కించాలని కొందరు ప్రయత్నం చేశారు. ఆయన పాత్రలో నన్ను నటించమని అడిగారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో నేను చేయలేకపోయాను.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more