Short News

ఆ తమిళ నటి ఎవరు, సస్పెన్స్‌లోకి నెట్టిన శ్రీరెడ్డి.. పోలీసు అంటూ షాకింగ్ న్యూస్!

ఆ తమిళ నటి ఎవరు, సస్పెన్స్‌లోకి నెట్టిన శ్రీరెడ్డి.. పోలీసు అంటూ షాకింగ్ న్యూస్!

మీడియా సంచలనం శ్రీరెడ్డి మరో ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. కాస్టింగ్ కౌచ్ చర్చతో మీడియాలో బాగా హైలైట్ అయిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అర్థ నగ్న నిరసనతో జాతీయ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ప్రముఖులపై తీవ్రమైన విమర్శలతో శ్రీరెడ్డి రెచ్చిపోయింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల నుంచి శ్రీరెడ్డి బయోపిక్ చిత్రం గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల విషయంలో శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది.

ఆసక్తి రేపుతోన్న 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' కత్రినా కైఫ్ పోస్టర్

ఆసక్తి రేపుతోన్న 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' కత్రినా కైఫ్ పోస్టర్

విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో 1839లో వచ్చిన 'కన్ఫెషన్స్ ఆఫ్ థగ్' అనే నవల ఆధారంగా 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్ .. ఆమిర్ ఖాన్ .. కత్రినా ఖైఫ్ .. ఫాతిమా సనా షేక్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కత్రినా కైఫ్ 'సురయ్యా' పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రకి సంబంధించిన ఆమె ఫస్టులుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కత్రినా మరింత గ్లామరస్ గా కనిపిస్తూ .. కైపెక్కించే చూపులతో కుర్రకారు మతులుపోగొడుతోంది. రేపు ఆమిర్ ఖాన్ ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.    
చెర్రీ సినిమా సెట్‌లో చిరంజీవి సంద‌డి

చెర్రీ సినిమా సెట్‌లో చిరంజీవి సంద‌డి

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వ‌స్తున్న సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. రామ్ చరణ్‌, ఆయ‌న సతీమణి ఉపాసన ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో ఉన్నారు. అయితే గురువారం చరణ్‌ సినిమా సెట్స్‌కు మెగాస్టార్‌ చిరంజీవి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారట. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘మామయ్యతో డిన్నర్‌. అందరం నలుపు రంగు దుస్తులు ధరించాం. జార్జియా వెళ్లడానికి ముందు మెగాస్టార్‌.. రామ్‌చరణ్‌ సెట్స్‌కు వచ్చారు' అని క్యాప్షన్‌ ఇస్తూ అందరూ కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.   
తమిళ టీవీ నటి నీలానీ ఆత్మహత్యాయత్నం!

తమిళ టీవీ నటి నీలానీ ఆత్మహత్యాయత్నం!

ప్రముఖ తమిళ టీవీ నటి నీలానీ ఆత్మహత్యయత్నం చేశారు. విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ప్రాణానికి ఎలాంటి హాని లేదని వైద్యులు స్పష్టం చేశారు. నీలాని ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలే అని తెలుస్తోంది. లలిత్ కుమార్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ కొన్ని రోజులుగా తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని నీలాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం లలిత్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటంతో... అతడి చావుకు కారణం నీలానీ అంటూ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more