Short News

ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికరమైన న్యూస్.. విద్యాబాలన్ ఏం చెప్పారంటే..

ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికరమైన న్యూస్.. విద్యాబాలన్ ఏం చెప్పారంటే..

తెలుగు జాతి కీర్తిని నలుదిశలా వ్యాపించేలా చేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌ సంచలనాలకు కారణమవుతున్నది. ఎన్టీఆర్‌గా ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తుండగా, సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో నిర్విరామంగా జరుగుతున్నది. ఇటీవల విద్యాబాలన్‌పై కొన్ని సీన్లను చిత్రీకరించారు. ఆ సీన్ల గురించి విద్యాబాలన్ చాలా ఉత్సాహం వెల్లడిస్తూ..

బాగోలేకుంటే అంతే, ‘శ్రీనివాస కళ్యాణం’ కథ విని ఎన్టీఆర్‌ ఫోన్ చేయలేదు: దిల్ రాజు

బాగోలేకుంటే అంతే, ‘శ్రీనివాస కళ్యాణం’ కథ విని ఎన్టీఆర్‌ ఫోన్ చేయలేదు: దిల్ రాజు

నితిన్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' ఇటీవల విడుదలై తొలి రోజు కాస్త మిక్డ్స్ టాక్ సొంతం చేసుకుంది. అయితే మళ్లీ పుంజుకుని మంచి వసూళ్లు సాధిస్తోందని నిర్మాత దిల్ రాజు తెలిపారు. సినిమా గురువారం విడుదల కావడం, డివైడ్ టాక్ రావడంతో వసూళ్లు సరిగా రాలేదని, శుక్రవారం కలెక్షన్ 50శాతం డౌన్ అవ్వడంతో అంతా కాస్త కంగారు పడ్డారు. కానీ నేను ముందే ఊహించాను... శనివారం మల్లీ పుంజుకుంది అంటూ బాక్సాఫీసు వద్ద సినిమా అసలు పరిస్థితిని నిర్మొహమాటంగా చెప్పేశారు దిల్ రాజు.

జనసేన' గుర్తు ‘పిడికిలి'

జనసేన' గుర్తు ‘పిడికిలి'

జనసేన' గుర్తు ‘పిడికిలి' అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని, అన్ని కులాలు, అన్ని మతాలూ కలసికట్టుగా ఉండి బలాన్ని చాటేలా పిడికిలి చూపుతామని అన్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే కనబడుతున్నాయని, ప్రజల బాధలు వింటుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలు గ్రామాల్లో, పట్టణాల్లో చెత్త పేరుకుపోయి ప్రజల జీవనం దుర్భరంగా మారిపోతోందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ సింబల్ ప్రకటించారు.
రాబోయే ఎన్నికలకు సెప్టెంబర్ లోనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం

రాబోయే ఎన్నికలకు సెప్టెంబర్ లోనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం

రాబోయే ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.మరోవైపు రాహుల్‌ మాట్లాడటంలో పరిణితి చెందాలని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టడం లేదన్న ఆయన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఢిల్లీ కుటుంబ పాలన కంటే తమ కటుంబ పాలనే బెటర్‌ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more