Short News

‘అవెంజర్స్‌ 4’ కథపై అమ్మాయి కల నెరవేరుతుందా.?

‘అవెంజర్స్‌ 4’ కథపై అమ్మాయి కల నెరవేరుతుందా.?

‘అవెంజర్స్‌ 4' సినిమా కథ తెలుసుకోవడమే తన చివరి కోరికని యూకేకు చెందిన అమ్మాయి కీరా అంటోంది. ఆమె గత కొంత కాలంగా బ్రెయిన్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ‘కీరా మరో ఆరు నెలలు మాత్రమే బతికే అవకాశం ఉంది. ‘అవెంజర్స్‌ 4'లో ఏమౌతుంది, ఆ సినిమా కథ ఏంటో తెలుసుకోవడమే ఆమె చివరి కోరిక. ఆమె కల నెరవేర్చడానికి కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నించారు. కానీ కుదరలేదు. దయచేసి రీట్వీట్‌ చేసి ఆమె కలను నిజం చేసేందుకు సహాయపడండి' అని మై షైనింగ్‌ స్టార్‌ చిల్డ్రెన్స్‌‌ క్యాన్సర్‌ ఛారిటీ సంస్థ ట్విటర్‌లో పేర్కొంది. దీంతోపాటు కీరా ఫొటోలు పోస్ట్‌ చేసింది.
కర్ణాటకలో 'డీజిల్' కొట్టించుకుంటున్నారు

కర్ణాటకలో 'డీజిల్' కొట్టించుకుంటున్నారు

హైదరాబాద్ నుండి కర్ణాటకకు వెళ్ళే వాహనాలు, అక్కడి నుండి వచ్చే వాహనాలు కర్ణాటకలోనే డీజిల్ ట్యాంకు ఫుల్‌ చేయించుకుంటున్నారు.  తెలంగాణలో లీటరు డీజిల్‌ రూ.80.35ఉండగా కర్ణాటకలో రూ.74.25గా ఉంది. దీంతో పొరుగు రాష్ట్రంలోనే ట్యాంకు ఫుల్‌ చేయిస్తున్నారు. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి కర్ణాటకకు రాకపోకలు సాగించే లారీలు, ప్రైవేటు బస్సులు కర్ణాటక సరిహద్దుల్లోనే డీజిల్‌ పోయించుకుంటున్నాయి. రోజురోజుకు డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో కర్ణాటక ఇటీవల స్థానిక పన్నుల్లో కొంత మినహాయించుకుంది.
బోనీకపూర్ సినిమాకి 'నో' చెప్పింది

బోనీకపూర్ సినిమాకి 'నో' చెప్పింది

దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ తండ్రి బోనీ కపూర్‌ సినిమాలో నటించడానికి 'నో' చెప్పింది. దీనిపై బోణీ స్పందిస్తూ 'మా ఫ్యామిలీతో కరణ్‌ జోహార్‌ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రస్తుతం జాన్వీకి మంచి గైడ్‌లా ఉన్నారు కరణ్‌. జాన్వీని కూతురిలా భావిస్తారాయన. నా ప్రమేయం లేకుండానే జాన్వీ నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పెద్ద కూతురితో నేను తీయబోయే సినిమా తీసే టైమ్‌ వీలైనంత తొందరగా రావాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. జాన్వీ ప్రస్తుతం 'తక్త్‌' అనే సినిమాలో నటిస్తోంది. 
రెండురోజుల్లో 2.72లక్షల కోట్లు ఆవిరి

రెండురోజుల్లో 2.72లక్షల కోట్లు ఆవిరి

భారతీయ స్టాక్‌మార్కెట్లను ముంచెత్తిన ఆకస్మిక నష్టాలకు భారీగా మదుపరుల సంపద ఆవిరైపోయింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా రాజుకోవడంతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. సోమ, మంగళవారాల్లో సెన్సెక్స్‌ 800 పాయింట్లకుపైగా నష్టపోయింది. మంగళవారం సెన్సెక్స్‌ 295 పాయింట్లు నష్టపోయి, 37,290 పాయింట్లకు పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణమైంది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ ఈ రెండు రోజులు కలిపి రూ.2,72,549.15కోట్ల సంపద ఆవిరి అయిపోయింది.  
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more