Short News

237 పులులు చ‌నిపోయాయి అయినా సంఖ్య య‌థాత‌థం

237 పులులు చ‌నిపోయాయి అయినా సంఖ్య య‌థాత‌థం

గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 237 పులులు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి మహేశ్ శర్మ సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. 2012 నుంచి 2017 వరకు చోటుచేసుకున్న మరణాల్లో 23 శాతం వేటగాళ్ల వల్లే మృతి చెందినట్లు తెలిపారు. అయినా పులుల సంఖ్యలో మాత్రం మార్పు రాలేదన్నారు. ప్రతి ఏడాది 5.8 శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతుందన్నారు. 2016లో 122, 2017లో 115 పులులు చనిపోయినట్లు మంత్రి చెప్పారు.   
పంద్రాగస్టు వేడుకల్లో పాట పాడిన కేజ్రీవాల్‌

పంద్రాగస్టు వేడుకల్లో పాట పాడిన కేజ్రీవాల్‌

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాట పాడారు. ఛత్రసాల్‌ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన 'హమ్‌ హోంగే కామ్యాబ్‌' పాట పాడారు. ఈ గీతాన్ని గిరిజ కుమార్‌ మాథుర్‌ హిందీలోకి అనువదించారు. కేజ్రీవాల్ ఉదయం ప్రముఖ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ రచించిన 'సారే జహా సే అచ్ఛా' గేయంలోని కొన్ని లైన్లను ట్విటర్‌లో పోస్ట్‌ చేసారు. కేజ్రీవాల్‌ 2013లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా పాటను ఆలపించారు. రెండేళ్ళ క్రితం ‘ఆ చల్‌ కే తుజే మైన్‌ లేకే చలూన్‌' అనే పాట పాడారు.  
సామ్రాట్‌తో పెళ్లెపుడని.. ట్రోల్స్ లైట్ తీసుకొన్నా.. నాది ఒంటరి జీవితం.. తేజస్వి

సామ్రాట్‌తో పెళ్లెపుడని.. ట్రోల్స్ లైట్ తీసుకొన్నా.. నాది ఒంటరి జీవితం.. తేజస్వి

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో రెండో సీజన్‌లో టైటిల్ గెలుస్తారనుకొన్న తేజస్వి మదివాడ అర్ధాంతరంగా బయటకు రావడం బుల్లితెర ప్రేక్షకులను షాక్ గురి చేసింది. ప్రారంభంలో తన సహజసిద్ధమైన ధోరణితో ఆకట్టుకొన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో పార్టిసిపెంట్ సామ్రాట్‌‌కు దగ్గరైన తర్వాత తన నేచర్‌కు విరుద్దంగా వ్యవహరించింది. దాంతో బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇంటి సభ్యుల గురించి, తన వ్యక్తిగత అనుభవాలను వివరించింది.

భారీవర్షాలు ..కేరళలో రెడ్ అలర్ట్

భారీవర్షాలు ..కేరళలో రెడ్ అలర్ట్

ఇప్పటికే భారీ వర్షాలకు, వరదలకు అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రైలు, బస్సు, విమాన సర్వీసులను అధికారులు నిలిపివేసారు. పంబానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాలు నీటమునిగాయి. పలు డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. తక్షణ సాయం కింద రూ.400కోట్లు అదనంగా మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more