Short News

అమ్మ జయలలితకు చికిత్స మేమే చేశాం, శశికళ లాయర్ ప్రశ్నలు!

అమ్మ జయలలితకు చికిత్స మేమే చేశాం, శశికళ లాయర్ ప్రశ్నలు!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందించిందని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు ఎయిమ్స్ వైద్యులు హాజరై వివరణ ఇచ్చారు. 2016 డిసెంబర్ 5వ తేదీ జయలలిత చికిత్స విఫలమై అపోలో ఆసుపత్రిలో మరణించారు. అయితే డిసెంబర్ 3వ తేదీన జయలలిత ఆసుపత్రిలో

కోహ్లీ హీరో కాబోతున్నాడు.. అందుకే ఆసియాకప్‌కు దూరమయ్యాడు!

కోహ్లీ హీరో కాబోతున్నాడు.. అందుకే ఆసియాకప్‌కు దూరమయ్యాడు!

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నాడనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. అయితే తన కొత్త ప్రాజెక్టు ప్రారంభమైందంటూ విరాట్‌ శుక్రవారం ట్వీట్‌ చేశాడు. ‘పదేళ్ల తర్వాత మరో తొలి పరిచయం. ‘ట్రైలర్‌‌ ది మూవీ' అని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చి  షేర్‌ చేశాడు. కోహ్లీ అతని సొంత బ్రాండ్‌ అయిన ‘రోంగ్‌' చొక్కాని ధరించి నడిచి వస్తూ.. ‘ట్రైలర్‌ ది మూవీ' అని రాసి ఉన్న పోస్టర్‌ను పంచుకున్నాడు. కోహ్లీ ట్వీట్‌పై నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ హీరో కాబోతున్నాడు. అందుకే ఆసియాకప్‌కు దూరమయ్యాడంటున్నారు.
కౌశల్ సతీమణి ఎమోషనల్‌గా.. ఇక ఆపండి.. ఇంట్లోకి వెళ్లి నేనేం చెప్పలేదు!

కౌశల్ సతీమణి ఎమోషనల్‌గా.. ఇక ఆపండి.. ఇంట్లోకి వెళ్లి నేనేం చెప్పలేదు!

బిగ్ బాస్ సీజన్ 2 సమరం మరికొద్ది రోజుల్లో ముగియయబోతోంది. దాదాపు 100 రోజులుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్స్ కి చేరుకునే సభ్యులు ఎవరో ఈ ఆదివారం తేలిపోనుంది. ఈ సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు. సీజన్ మొత్తం ఆడియన్స్ నుంచి అతడికి అద్భుతమైన సపోర్ట్ లభించింది. గీత, కౌశల్, దీప్తి కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సామ్రాట్ అందరికంటే ముందుగా ఫైనల్ కు చేరిపోయాడు.

టాంజానియాలో ప‌డ‌వ మునిగి 87 మంది దుర్మ‌ర‌ణం

టాంజానియాలో ప‌డ‌వ మునిగి 87 మంది దుర్మ‌ర‌ణం

ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర ప‌డ‌వ‌ ప్రమాదం చోటుచేసుకుంది. లేక్ విక్టోరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో 86 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 200 మంది ప్రయాణికులు గ‌ల్లంతై ఉంటారని అంచనా వేస్తున్నారు. ఉకోరా, బుగొలోరా దీవుల మధ్య ప‌డ‌వ‌ మునిగింది. వంద మంది సామ‌ర్థ్యం గ‌ల ప‌డవ‌లో 400 ప్ర‌యాణించ‌డంతో పడవ ఒక వైపుకు ఒరిగి ఈ ప్రమాదం జరిగింది. వంద మందిని ర‌క్ష‌క ద‌ళాలు ర‌క్షించాయి. అందులో 37 మంది పరిస్థితి విషమంగా ఉంది. బోటు ప్రయాణం కోసం ఎంత మందికి టికెట్లు ఇచ్చారో స్పష్టంగా తెలియడం లేదు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more